Bigg Boss 5: ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ గెట్ టూ గెదర్.. ఎక్కడంటే?

బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఎనిమిది వారాలు పూర్తవగా సోమవారం తొమ్మిదో వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఇంటి నుండి..

Bigg Boss 5: ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ గెట్ టూ గెదర్.. ఎక్కడంటే?

Bigg Boss 5 (2)

Bigg Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఎనిమిది వారాలు పూర్తవగా సోమవారం తొమ్మిదో వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఇంటి నుండి ఎలిమినేషన్ కాగా ప్రస్తుతం ఇంట్లో 11 మంది మాత్రమే ఉన్నారు. తొలి వారం సరయూ, రెండో వారం ఉమాదేవి, మూడో వారం ల‌హ‌రి, నాలుగో వారం న‌ట‌రాజ్ మాస్ట‌ర్, ఐదోవారం హ‌మీదా, ఆరోవారం శ్వేతా వ‌ర్మ‌, ఏడో వారం ప్రియ‌, ఎనిమిదో వారం లోబో ఎలిమినేట్ అయ్యారు. ఈ ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్లు ఇప్పుడు గెట్ గెదర్ అయ్యారు.

Bigg Boss 5: షణ్ముఖ్ తప్ప మిగతా పది మంది నామినేట్!

ఎలిమినేషన్ అయిన వారిలో లోబో మినహా మిగతా కంటెస్టెంట్లు అంతా నటరాజ్ మాస్టర్ ఇంట్లో ఓ చిన్న ఫంక్షన్ కు అటెండ్ అయినట్లు తెలుస్తుంది. ఇందులో ఉమాదేవి, లహరి, ప్రియా, హమీదా, శ్వేతావర్మలున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా ఈ గెట్ టూ గెదర్ లో సరయూ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, ఫోటోలలో సరయూ ఎక్కడా కనిపించడం లేదు.

Bigg Boss 5: నా పుట్టలో వేలు పెడితే నేను పెట్టనా.. కాజల్ VS శ్రీరామ్!

కాగా.. ఈ సీజన్ మాత్రమే కాదు.. గతంలో నాలుగు సీజన్లలో కంటెస్టెంట్లు కూడా స్నేహితులుగా మారి అప్పుడప్పుడు ఒకచోట చేరడం.. సరదా షికార్లు చేస్తూ వీడియోలు పోస్ట్ చేయడం చూశాం. అయితే, ఇప్పుడు ఇంకా సీజన్ పూర్తికాకముందే ఐదవ సీజన్ కంటెస్టెంట్లు ఇలా ఒకే చోట కలవడంతో వీరిమధ్య ఇంకా బాండింగ్ ఉన్నట్లుగా అభిమానులు ఫీలవుతున్నారు. కాగా, వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఈ గెట్ టూ గెదర్ కూడా హాట్ టాపిక్ అవుతుంది.