Mahesh-Ram Charan: సమయం లేదు మిత్రమా.. దూకుడు మీదున్న హీరోలు!

హీరోలు అసలేమాత్రం లేట్ చెయ్యడం లేదు.. ఎప్పుడు ఏ వైరస్ వచ్చి షూటింగ్ కి అడ్డం పడుతుందో.. డేట్స్ క్లాష్ తో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ కి అడ్డం పడిపోతుందో అని వరుస పెట్టి..

Mahesh-Ram Charan: సమయం లేదు మిత్రమా.. దూకుడు మీదున్న హీరోలు!

Mahesh Ram Charan

Mahesh-Ram Charan: హీరోలు అసలేమాత్రం లేట్ చెయ్యడం లేదు.. ఎప్పుడు ఏ వైరస్ వచ్చి షూటింగ్ కి అడ్డం పడుతుందో.. డేట్స్ క్లాష్ తో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ కి అడ్డం పడిపోతుందో అని వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు. సమయం లేదు మిత్రమా.. సినిమాలు వరసగా చెయ్యాలి మిత్రమా అనుకుంటూ.. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాల్ని సెట్స్ మీదకెక్కించేస్తున్నారు స్టార్లు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క పనీ అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. ఏ ఒక్క సినిమా ఫస్ట్ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కి ధియేటర్లోకి రాలేదు. ఒకసారి కోవిడ్ తో, మరోసారి రిలీజ్ క్లాష్ తో ఇప్పటికే సినిమాలు చెయ్యడం లేట్ అయిపోయిన హీరోలు ఇప్పుడు అస్సలు రిలాక్స్ అవ్వడం లేదు. ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

Senapathi: పోలీసోడు గన్ పోగొట్టుకుంటే.. ఉత్కంఠగా సేనాపతి ట్రైలర్!

లేటెస్ట్ గా మహేష్ బాబు.. త్రివిక్రమ్ తో నెక్ట్స్ తనుచెయ్యబోతున్న సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కబోతున్న సినిమా స్టోరీ సిట్టింగ్స్ లో ఫుల్ బిజీ అయ్యారు. నెక్ట్స్ మన్త్ లో మొదలవబోతున్న ఈసినిమాకు సంబంధించి థమన్, త్రివిక్రమ్ తో పాటు ప్రొడ్యూసర్ నాగవంశీ కలిసి మహేష్ దుబాయ్ లో సినిమా పనుల్ని స్పీడప్ చేస్తున్నారు. ఈ సినిమాతోనేకాదు.. మహేష్ బాబు రాజమౌళితో చెయ్యబోతున్న సినిమా కూడా అక్టోబర్ 2022 లో సెట్స్ మీదకెళ్లబోతోందని, మహేష్ తో ఇప్పటికే సినిమా గురించి డిస్కస్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు రాజమౌళి. ప్రజెంట్ పరశురామ్ తో సర్కారువారి పాట సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న మహేష్.. షూట్ బ్రేక్ లో నెక్ట్స్ సినిమా పనుల్ని స్పీడప్ చేస్తున్నారు.

Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ దూకుడు.. వచ్చే ఏడాది కూడా నాదే!

మహేష్ బాబు బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో బిజీగా ఉంటే ట్రిపుల్ ఆర్ రిలీజ్ తో ఫుల్ బిజీ ఉన్న రామ్ చరణ్ కూడా ఆల్రెడీ శంకర్ సినిమా ని సెట్స్ మీదపెట్టేశాడు. యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో మరో మూవీ కూడా అనౌన్స్ చేశాడు. లేటెస్ట్ గా సుకుమార్ తో చెయ్యబోయే సినిమా ప్లాట్ ని కూడా అప్పుడే రెడీ చేసేసుకున్నారు. రంగస్తలంతో చరణ్ కి అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ తో మరో సినిమా చేస్తానని అప్పుడే అనౌన్స్ చేసిన చరణ్.. సుక్కుతో సినిమాని కూడా లైన్లో పెట్టి ప్యార్లల్ గా ఆ సినిమా స్క్రిప్టింగ్ తో ఎంగేజ్ అయిపోయారు.