Mahesh Vitta : నాలుగేళ్లుగా రిలేషన్.. త్వరలోనే పెళ్లి..

మహేష్ విట్టా మాట్లాడుతూ.. ''నేను, తను నాలుగేళ్లుగా రిలేషన్‌లో ఉన్నాం. ఆమె నా సిస్టర్ ఫ్రెండ్. తను ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది. రెండు సార్లు చూశాను, తనని చూసినప్పుడు......

Mahesh Vitta : నాలుగేళ్లుగా రిలేషన్.. త్వరలోనే పెళ్లి..

Mahesh

Mahesh Vitta :  యూట్యూబ్‌లో తన చిత్తూర్ స్లాంగ్‌తో, తన కామెడీతో ఫేమస్ అయ్యాడు మహేష్ విట్టా. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఇటీవలే హీరోగా కూడా మారాడు. గతంలో బిగ్‌బాస్‌‌లో పాల్గొన్న మహేష్ ప్రస్తుతం బిగ్‌బాస్‌ నాన్ స్టాప్‌లో కూడా పాల్గొంటున్నాడు. బిగ్‌బాస్‌‌లోకి వెళ్లేముందు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు మహేష్ విట్టా. ఈ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌‌తో పాటు తన పెళ్లి గురించి కూడా మాట్లాడాడు.

మహేష్ విట్టా మాట్లాడుతూ.. ”నేను, తను నాలుగేళ్లుగా రిలేషన్‌లో ఉన్నాం. ఆమె నా సిస్టర్ ఫ్రెండ్. తను ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది. రెండు సార్లు చూశాను, తనని చూసినప్పుడు మా అమ్మలాగా ఉందనిపించింది. దాంతో ప్రపోజ్ చేశాను. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే ప్రపోజ్ చేశాను, దాంతో తనకి కోపం వచ్చి పరిచయమవ్వగానే ప్రపోజ్ ఏంటి అని తిట్టింది. అయితే ఫ్రెండ్‌లా ఉందాం అని అడిగాను. ఓకే చెప్పింది. రెండేళ్ల తర్వాత నా ప్రేమకి ఓకే చెప్పింది.”

Leader : మళ్ళీ రానా, శేఖర్ కమ్ముల కాంబినేషన్.. ‘లీడర్ 2’ త్వరలో??

”మేము ఎంత గొడవపడ్డా వెంటనే కలిసిపోతాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. గతేడాది మా ఇద్దరి ఇంట్లో చెప్పాము, ఒప్పుకున్నారు. ప్రస్తుతం నేను హీరోగా ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక మేము పెళ్లి చేసుకుంటాము” అని తెలిపాడు. అయితే ఆ అమ్మాయి ఎవరో మాత్రం చెప్పలేదు మహేష్ విట్టా. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాడు మహేష్ విట్టా.