Major Movie : ‘మేజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి అదరగొట్టబోతున్న అడవిశేష్..

అడవిశేష్ తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే సినిమాలు తీసే హీరో. తన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. త్వరలో మేజర్ సినిమాతో రాబోతున్నాడు శేష్. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ఉగ్రవాదులతో

Major Movie : ‘మేజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి అదరగొట్టబోతున్న అడవిశేష్..

Major

Major Movie :  అడవిశేష్ తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే సినిమాలు తీసే హీరో. తన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. త్వరలో మేజర్ సినిమాతో రాబోతున్నాడు శేష్. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ‘మేజర్’ సినిమాతో రాబోతున్నాడు శేష్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్, టీజర్ కి మంచి స్పందన వచ్చి సినిమా పై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇవాళ ‘మేజర్’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Vishal : తిరుమలకు హీరో విశాల్.. రోజాతో కలిసి సినిమా ప్రమోషన్

ఈ సినిమా మేకింగ్ వీడియోతో పాటు రిలీజ్ డేట్ ని ఇవాళ విడుదల చేశారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా థియేటర్స్ లో రాబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల అవ్వనుంది. శేష్ తో ‘గూఢచారి’ సినిమా తీసిన డైరెక్టర్ శశికిరణ్ తిక్కా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా పాలు పంచుకున్నాడు. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేష్ ఈ సినిమాని సోనీ పిక్చర్స్, ఏప్లస్ఎస్ మూవీస్ తో కలిసి నిర్మిస్తున్నారు. మేకింగ్ వీడియో విజువల్స్ చూస్తుంటేనే చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి భారతీయుడు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాతో అడవి శేష్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని తెలుస్తుంది.