Pawan Kalyan : నేను పవన్ కళ్యాణ్‌తో వర్క్ చేయడం లేదు.. మాళవిక మోహనన్!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలో హీరోయిన్స్ గా శ్రీలీల, మాళవిక మోహనన్ ని ఎంపిక చేశారు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ కాస్త వైరల్ అయ్యి మాళవిక మోహనన్ వరకు చేరాయి. దీంతో ఆమె వీటిపై స్పందిస్తూ..

Pawan Kalyan : నేను పవన్ కళ్యాణ్‌తో వర్క్ చేయడం లేదు.. మాళవిక మోహనన్!

Malavika Mohanan gave clarity on casting her in Ustaad Bhagat Singh

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం పవన్.. హరిహర వీరమల్లు, The OG, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సిత్తం రీమేక్ సినిమాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రెజెంట్ వినోదయ సిత్తం రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 25 రోజుల్లో పూర్తి కానుంది. దీని తరువాత ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న వీరమల్లులో పాల్గొనున్నాడు. ఆ తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ హరీష్ శంకర్ మొదలు పెట్టేశాడు.

Pawan Kalyan: మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన పవన్.. ఆ డైరెక్టర్‌తో మూవీకి సిద్ధం..?

కాగా ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రీలీల (Sree Leela), మాళవిక మోహనన్ ని (Malavika Mohanan) ఎంపిక చేశారు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ కాస్త వైరల్ అయ్యి మాళవిక మోహనన్ వరకు చేరాయి. దీంతో ఆమె వీటిపై స్పందిస్తూ.. “పవన్ కళ్యాణ్ సార్ తో పని చేయాలనీ నాకు ఉంది. అయితే ఇప్పుడు నేను ఏ ప్రాజెక్ట్ లో పవన్ కళ్యాణ్ సార్ తో వర్క్ చేయడం లేదు. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో మెయిన్ హీరోయిన్ గా ఒక సినిమా అయితే చేస్తున్నాను. ఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది.

Ustaad Bhagat Singh : పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ పనులు మొదలు!

దీంతో ఉస్తాద్ లో (Ustaad Bhagat Singh) మాళవిక నటిస్తుంది అన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అయితే తాను ఒక తెలుగు సినిమాలో నటిస్తుంది అని చెప్పింది.. ప్రభాస్ (Prabhas), మారుతీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ గురించే అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. హార్రర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటికీ, ఇప్పటి వరకు ఈ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.