Pawan Kalyan: మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన పవన్.. ఆ డైరెక్టర్‌తో మూవీకి సిద్ధం..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న పవన్, ఈ సినిమా రిలీజ్ కాకమందే తన నెక్ట్స్ ప్రాజెక్టులను వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకెళ్తున్నాడు.

Pawan Kalyan: మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన పవన్.. ఆ డైరెక్టర్‌తో మూవీకి సిద్ధం..?

Pawan Kalyan To Do Movie With This Young Director

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న పవన్, ఈ సినిమా రిలీజ్ కాకమందే తన నెక్ట్స్ ప్రాజెక్టులను వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకెళ్తున్నాడు.

Pawan Kalyan: కన్నడ డైరెక్టర్‌తో పవన్.. బాక్సాఫీస్‌ను ‘కబ్జా’ చేసేందుకు రెడీ అవుతున్నారా..?

దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాన్ని ఓకే చేసిన పవన్, మరో డైరెక్టర్ సుజిత్ కుమార్ దర్శకత్వంలో ‘OG’ అనే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలు స్టార్ట్ కాకముందే, తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘వినోదయా సీతం’ చిత్రాన్ని తెలుగులో దర్శకుడు సముద్రఖని రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో పాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

Pawan Kalyan: కులాల మధ్య చిచ్చుపెట్టేలా కుట్రలు జరుగుతున్నాయ్.. ఆ ఉచ్చులో ఎవరూ పడొద్దు ..

ఇదిలా ఉండగా, ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ సుధీర్ వర్మతో పవన్ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను అందిస్తున్నాడట. ఈ సర్‌ప్రైజ్ న్యూస్‌తో మరోసారి పవన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్‌ను పవన్ నిజంగానే ఓకే చేస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది.