Mallika Sherawat : దీపికా పదుకొణె ఇప్పుడు చేసింది నేను 15 ఏళ్ళ క్రితమే చేశా.. అందుకు నన్ను టార్చర్ చేశారు..

మల్లికా శెరావత్ మాట్లాడుతూ.. ''దీపికా పదుకొణె గెహ్రియాన్‌ సినిమాలో ఏం చేసిందో 15 ఏళ్ల క్రితం మర్డర్‌లో నేనూ అదే చేశాను. కానీ అప్పుడు జనాల ఆలోచన ఎంతో సంకుచితంగా...........

Mallika Sherawat : దీపికా పదుకొణె ఇప్పుడు చేసింది నేను 15 ఏళ్ళ క్రితమే చేశా.. అందుకు నన్ను టార్చర్ చేశారు..

Mallika Sherawat

Mallika Sherawat :  బాలీవుడ్‌ హాట్ హీరోయిన్‌ మల్లికా శెరావత్‌ మర్డర్, హిస్.. లాంటి పలు సినిమాలతో హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఓ ఇరవై ఏళ్ళ క్రితం కెరీర్ ఆరంభంలోనే బికినీ, ముద్దు సీన్లతో రెచ్చిపోయి నటించింది. అప్పట్లో ఇలాంటి సీన్స్ చేసినందుకు మల్లికాపై చాలా మంది విరుచుకుపడ్డారు. తాజాగా తన కొత్త సినిమా ఆర్కే ప్రమోషన్స్ లో భాగంగా ఆ విషయాలని గుర్తు చేసుకుంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆర్కే సినిమాలో మల్లికా శెరావత్‌తో పాటు కుబ్ర సైత్‌, రణ్‌వీర్‌ షోరే, మను రిషిచద్ద, చంద్రచూర్‌ రాయ్‌, అభిజీత్‌ దేశ్‌పాండే, అభిషేక్‌ శర్మ… పలువురు నటి నటులు నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో తన గురించి మాట్లాడింది.

Daler Mehndi : మరోసారి జైలుకెళ్లిన ప్రముఖ సింగర్‌

మల్లికా శెరావత్ మాట్లాడుతూ.. ”దీపికా పదుకొణె గెహ్రియాన్‌ సినిమాలో ఏం చేసిందో 15 ఏళ్ల క్రితం మర్డర్‌లో నేనూ అదే చేశాను. కానీ అప్పుడు జనాల ఆలోచన ఎంతో సంకుచితంగా ఉండేది. ముద్దు పెట్టడాన్ని, బికినీ వేసుకోవడాన్ని చాలా తప్పుపట్టారు. ఇక ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులు కూడా అలా చేసినందుకు నన్ను మానసికంగా వేధించారు. కేవలం గ్లామర్‌ ఒలకబోయడం తప్ప నటన రాదని చాలా మంది తిట్టారు. దశావతారం, ప్యార్‌కి సైడ్‌ ఎఫెక్ట్స్‌, వెల్‌కమ్‌ వంటి నటనకి ఆస్కారం ఉన్న సినిమాలు చేసినా ఎవరూ నా నటనను గుర్తించలేదు. అప్పుడు నన్ను ఎందుకైతే విమర్శించారో ఇప్పుడు అందరు అదే చేస్తున్నారు” అని తెలిపింది. దీంతో మల్లికా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.