Daler Mehndi : మరోసారి జైలుకెళ్లిన ప్రముఖ సింగర్‌

పంజాబ్ కి చెందిన ప్రముఖ సింగర్ దలెర్‌ మెహందీ మరోసారి జైలుకెళ్లారు. దలెర్‌ మెహందీ, అతని సోదరుడు షంషేర్‌ సింగ్‌ కలిసి మ్యూజిక్ ట్రూప్ నిర్వహించేవారు. పంజాబ్ లో వీరి పాటలకి.........

Daler Mehndi : మరోసారి జైలుకెళ్లిన ప్రముఖ సింగర్‌

Daler Mehndi

Updated On : July 15, 2022 / 6:35 AM IST

Daler Mehndi :  పంజాబ్ కి చెందిన ప్రముఖ సింగర్ దలెర్‌ మెహందీ మరోసారి జైలుకెళ్లారు. దలెర్‌ మెహందీ, అతని సోదరుడు షంషేర్‌ సింగ్‌ కలిసి మ్యూజిక్ ట్రూప్ నిర్వహించేవారు. పంజాబ్ లో వీరి పాటలకి మంచి ఆదరణ ఉంది. దాదాపు 20 ఏళ్లకుపైగానే వీరు పాటలు పాడుతున్నారు. అయితే 20 ఏళ్ళ క్రితం ‘మ్యూజికల్‌ ట్రూప్‌’ అనే ఓ మ్యూజిక్ సంస్థ పేరుతో కొంతమందిని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని వీరిపై కేసు నమోదైంది. 1998, 1999 సంవత్సరాలలో వీరు దాదాపు పది మందిని అక్రమంగా అమెరికాలో వదిలేశారని, ఇందుకోసం వీళ్ళు భారీగా డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Aamir Khan : లాల్ సింగ్ చద్దా కోసం మెగా ప్రివ్యూ.. అమీర్ ఖాన్ కోసం టాలీవుడ్..

ఆ సమయంలో దలెర్‌ మెహందీకి వ్యతిరేకంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై విచారణ జరిపిన న్యాయస్థానం దలెర్‌ మెహందీకి, అతని సోదరుడికి రెండేళ్లపాటు జైలు శిక్ష ఖరారు చేసింది. వీరు కొన్నాళ్లపాటు జైలులో గడిపి ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ బెయిల్ మీదే బయట తిరుగుతున్నారు. తాజాగా అతడి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో వారిద్దరినీ మళ్ళీ అరెస్ట్‌ చేశారు. వీరిని అరెస్ట్ చేసి పటియాలా జైలుకు తీసుకెళ్లారు.