Karnataka College Girl : పోకిరికి కాలేజీ అమ్మాయి గుణపాఠం..అందరిముందు చెప్పుతో కొట్టింది

తనను వెంటాడి, వేధిస్తున్న యువకుడికి కర్ణాటక కళాశాల అమ్మాయి బుద్ధి చెప్పిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఉదంతం సంచలనం రేపింది....

Karnataka College Girl : పోకిరికి కాలేజీ అమ్మాయి గుణపాఠం..అందరిముందు చెప్పుతో కొట్టింది

Karnataka College Girl

Karnataka College Girl : తనను వెంటాడి, వేధిస్తున్న యువకుడికి కర్ణాటక కళాశాల అమ్మాయి బుద్ధి చెప్పిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఉదంతం సంచలనం రేపింది. శుక్రవారం ఉదయం కళాశాల విద్యార్థిని హాస్టల్ నుంచి కాలేజీకి వెళుతుండగా ఓ పోకిరి వెంబడించి, మాటలతో వేధించాడు.(Man Allegedly Follows, Harasses) దీంతో గ్రామస్థులు పోకిరిని పట్టుకున్నారు.

Missing Children in Amazon forest: విమాన ప్రమాదం తర్వాత అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన పిల్లలు…40 రోజుల తర్వాత ఏమైందంటే..

తనను వేధించిన యువకుడిని గ్రామస్థులు పట్టుకోగా కాలేజీ అమ్మాయి తన చెప్పుతో దేహశుద్ధి చేసింది.(Beaten With Slippers) ఈ ఉదంతాన్ని స్థానికులు వీడియో తీశారు. అమ్మాయి పోకిరిని చెప్పుతో కొడుతుండగా, తనను విడిచిపెట్టమని యువకుడు స్థానికులను అభ్యర్థించడం వీడియోలో కనిపించింది. అమ్మాయి పోకిరికి దేహశుద్ధి చేసిన తర్వాత స్థానిక ప్రజలు అతన్ని పోలీసులకు అప్పగించారు.