Missing Children in Amazon forest: విమాన ప్రమాదం తర్వాత అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన పిల్లలు…40 రోజుల తర్వాత ఏమైందంటే..
చిన్న విమాన ప్రమాదం తర్వాత కొలంబియాలోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో తప్పిపోయిన నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత సజీవంగా దొరికిన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. సెస్నా2006 చిన్న విమానం మే 1వతేదీన ప్రమాదవశాత్తూ దట్టమైన అమెజాన్ అడవుల్లో కూలింది....

Amazon forest
After Plane Crash 4 Missing Children in Amazon forest: చిన్న విమాన ప్రమాదం తర్వాత కొలంబియాలోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో తప్పిపోయిన నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత సజీవంగా దొరికిన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. సెస్నా2006 చిన్న విమానం మే 1వతేదీన ప్రమాదవశాత్తూ దట్టమైన అమెజాన్ అడవుల్లో కూలింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు పిల్లలు అడవిలో తప్పిపోయారు. తప్పిపోయిన పిల్లలు 13, 9, 4, ఒక సంవత్సరం వయస్సు గలవారు.
40 రోజుల క్రితం కొలంబియా అడవిలో గల్లంతైన నలుగురు పిల్లలు శుక్రవారం సజీవంగా కనిపించారని అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ట్విట్టర్‌లో రాశారు.ఈ వార్త కొలంబియా దేశమంతటికి సంతోషాన్నిచ్చిందని పెట్రో పేర్కొన్నారు.దట్టమైన అమెజాన్ అడవి సైనికులు పిల్లలను కాపాడి వారితో దిగిన ఫొటోను దేశాధ్యక్షుడు పెట్రో ట్విట్టరులో పోస్టు చేశారు. ‘‘అవును, పిల్లలు దొరికారు, కానీ నేను వెళ్లి వారిని అత్యవసరంగా తీసుకురావడానికి నాకు ఫ్లైట్ లేదా హెలికాప్టర్ కావాలి’’ అని పిల్లల తాత ఫిడెన్సియో వాలెన్సియా చెప్పారు.
Very Severe Cyclone Biparjoy: తుపాన్ ఎఫెక్ట్: సముద్ర తీరంలో ఎతైన అలలు..భారీవర్షాలు
నలుగురు చిన్నారులు 40 రోజులుగా అమెజాన్ అడవిలో తిరుగుతూ ప్రాణాలు దక్కించుకున్నారని పెట్రో చెప్పారు. విమాన ప్రమాదం జరిగిన తర్వాత సంఘటన స్థలంలో ముగ్గురు పెద్దల మృతదేహాలు లభించాయి. పిల్లల తల్లి, పైలట్, పిల్లల బంధువు మరణించగా పిల్లలు మాత్రం తప్పిపోయి అడవిలో తిరుగుతూ సజీవంగా ఉండటం విశేషం.