Brij Bhushan : మహిళా రెజ్లర్లను బ్రిజ్‌భూషణ్ ఏం చేశాడంటే.. రెజ్లింగ్ రిఫరీ సంచలన సాక్ష్యం

మహిళా రెజ్లర్లను భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ ఏం చేశాడో అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీ సంచలన సాక్ష్యంలో వెల్లడించారు. తరచూ మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించడం తాను చూశానని రిఫరీ చెప్పడం సంచలనం రేపింది....

Brij Bhushan : మహిళా రెజ్లర్లను బ్రిజ్‌భూషణ్ ఏం చేశాడంటే.. రెజ్లింగ్ రిఫరీ సంచలన సాక్ష్యం

Brij-Bhushan

Brij Bhushan inappropriately touch female wrestlers : మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ రిఫరీ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు.బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లతో అనుచితంగా ప్రవర్తించడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని రెజ్లింగ్ రిఫరీ జగ్బీర్ సింగ్ తెలిపారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై విచారణ సందర్భంగా అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీ జగ్బీర్ సింగ్(international wrestling referee Jagbir Singh) పలు విషయాలు చెప్పారు. బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లతో చాలాసార్లు అనుచితంగా ప్రవర్తించడం చూశానని రిఫరీ పేర్కొన్నారు.(inappropriately touch female wrestlers)

Very Severe Cyclone Biparjoy: తుపాన్ ఎఫెక్ట్: సముద్ర తీరంలో ఎతైన అలలు..భారీవర్షాలు

గత ఏడాది మార్చి 25వతేదీన లక్నోలో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్ రెజ్లింగ్ ట్రయల్స్ సందర్భంగా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్‌తో అనుచితంగా ప్రవర్తించాడని జగ్బీర్ సింగ్ చెప్పారు.విచారణలో డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, కోచ్‌లు, క్రీడా సిబ్బందితో పాటు రెజ్లర్ల ఫోటో సెషన్ ఉందని ఆయన చెప్పారు.‘‘ఫోటో సెషన్ సమయంలో బ్రిజ్ భూషణ్ పక్కన ఒక మహిళా రెజ్లర్ నిలబడి ఉంది. అయితే, కొద్దిసేపటికే ఆ మహిళ తన అసౌకర్యాన్ని వ్యక్తం చేసింది, దీంతో అందరి దృష్టి ఆమె వైపు మళ్లింది. బ్రిజ్ భూషణ్ ఆమెను పట్టుకుంటే తనను తాను విడిపించుకొని దూరంగా వెళ్లి, లైంగిక వేధింపులపై గొణిగింది’’ అని సింగ్ చెప్పారు.

UK Ex PM Boris Johnson Resigns As MP:యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎంపీగా రాజీనామా

బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్‌పై అనుచితంగా చేతులు ఉంచడం తాను చూశానని రిఫరీ సింగ్ చెప్పారు.బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను పొగడ్తలతో ముంచెత్తడంతోపాటు వారికి ఏదైనా అవసరమైతే తాను అక్కడ ఉన్నానని వారికి చెప్పాడు.థాయ్‌లాండ్‌కు చెందిన బ్రిజ్ భూషణ్ స్నేహితులు కొందరు కూడా హోటల్‌లో ఉన్నారని, వారు మద్యం మత్తులో ఉన్నారని సింగ్ చెప్పారు. భూషణ్ స్నేహితులు కూడా యువతులను అనుచితంగా తాకారని రిఫరీ చెప్పారు.

Hyderabad, Delhi airfares Hike : ఒడిశా రైలు ప్రమాదం తర్వాత విమాన టికెట్ల ధరలు మూడు రెట్లు పెంపు

మరోవైపు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై జూన్‌ 15వతేదీలోగా చార్జిషీట్‌ దాఖలు చేస్తామని క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.నిరసన తెలిపిన మల్లయోధులను కలిసిన తర్వాత, జూన్ 30వతేదీలోగా భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహిస్తామని ఠాకూర్ హామీ ఇచ్చారు.డబ్ల్యుఎఫ్‌ఐకి మహిళ నేతృత్వంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని ఠాకూర్ వివరించారు.