UK Ex PM Boris Johnson Resigns As MP:యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎంపీగా రాజీనామా

బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంటు సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. తాను అన్ని రకాల కొవిడ్ నియమాలు పాటించినట్లు చెప్పిన బోరిస్ జాన్సన్ హౌస్ ఆఫ్ కామన్స్ ను తప్పుదారి పట్టించాడంటూ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు....

UK Ex PM Boris Johnson Resigns As MP:యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎంపీగా రాజీనామా

Boris Johnson

UK Ex PM Boris Johnson Resigns As MP: బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంటు సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. తాను అన్ని రకాల కొవిడ్ నియమాలు పాటించినట్లు చెప్పిన బోరిస్ జాన్సన్ హౌస్ ఆఫ్ కామన్స్ ను తప్పుదారి పట్టించాడంటూ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.(Boris Johnson Resigns) దీంతో ఉప ఎన్నిక జరగనుంది. తాను పార్లమెంటును విడిచిపెట్టడం చాలా విచారకరం అంటూ జాన్సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Fire Breaks out at Hospital: ఢిల్లీ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..20 మంది నవజాత శిశువుల తరలింపు

‘‘నేను కొద్దిమంది వ్యక్తుల వల్ల బలవంతంగా బయటకు వెళుతున్నాను’’ అని ఆయన చెప్పారు.జాన్సన్ పార్లమెంటును నిర్లక్ష్యంగా లేదా ఉద్ధేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని పార్లమెంటు ప్రివిలేజెస్ కమిటీ ఆరోపించింది.‘‘పార్లమెంటు నుంచి నన్ను తరిమికొట్టేందుకు జరుగుతున్న చర్యలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి, ప్రివిలేజెస్ కమిటీ నుంచి నాకు ఒక లేఖ అందింది’’ అని మాజీ ప్రధాని చెప్పారు.‘‘2001 నుంచి ఎంపీగా ఉన్నాను.. నా బాధ్యతలను సీరియస్‌గా తీసుకుంటాను. నేను అబద్ధం చెప్పలేదు,కానీ వారు ఉద్ధేశపూర్వకంగా సత్యాన్ని విస్మరించారు’’ అని జాన్సన్ చెప్పారు.