Manchi Rojulu Vachayi: ట్రైలర్ టాక్.. బోలెడంత ఫన్ నింపేసిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్!

‘ప్రతి రోజూ పండగే’ సక్సెస్ తర్వాత మారుతి తెరకెక్కించిన సినిమా.. అది కూడా గోపీచంద్ సీటీమార్ షూటింగ్ గ్యాప్ వచ్చిన నెల రోజులను వృధా చేయడం ఇష్టంలేని మారుతీ.. తనకి తట్టిన ఒక పాయింట్..

Manchi Rojulu Vachayi: ట్రైలర్ టాక్.. బోలెడంత ఫన్ నింపేసిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్!

Manchi Rojulu Vachayi

Manchi Rojulu Vachayi: ‘ప్రతి రోజూ పండగే’ సక్సెస్ తర్వాత మారుతి తెరకెక్కించిన సినిమా.. అది కూడా గోపీచంద్ సీటీమార్ షూటింగ్ గ్యాప్ వచ్చిన నెల రోజులను వృధా చేయడం ఇష్టంలేని మారుతీ.. తనకి తట్టిన ఒక పాయింట్ ను కథగా మలచి తెరకెక్కించిన సినిమా మంచి రోజులు వచ్చాయి. ‘ఏక్ మినీ కథ’ వంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తోన్న సినిమా కూడా ఇదే కాగా.. వీరికి తోడు గ్లామర్ డాల్.. నటనలో కూడా మెరుగైన మెహ్రీన్ తోడై ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు.

Rowdy Boys: లిప్‌లాక్.. ఘాటు రొమాన్స్.. రూటు మార్చిన అనుపమ?

ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే టీజర్లు, సాంగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ కాగా.. గత వారం వచ్చిన ట్రైలర్ కామెడీని కోరుకొనే ప్రేక్షకులను ఈ సినిమా గురించి వెయిట్ చేసేలా చేశాయి. మరో వారం రోజులే సినిమా విడుదలకు ఉండడంతో యూనిట్ ప్రచారాన్ని కూడా ముమ్మరంగా మొదలు పెట్టింది. శుక్రవారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన మంచి రోజులు వచ్చాయి టీం.. ఈ ఈవెంట్ నుండే రిలీజ్ ట్రైలర్ ను వదిలింది. ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగానే అట్రాక్ట్ చేస్తుంది.

Indian 2: తొలిగిన విబేధాలు.. మళ్ళీ సెట్స్ మీదకి భారతీయుడు?

ఒకవైపు రొమాంటిక్ కథగా చెప్తూనే.. రిలీజ్ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా కనిపించింది. మారుతి బ్రాండ్ రొమాన్స్ తో పాటు సిట్యుయేషనల్ కామెడీని కూడా వర్కవుట్ చేయగా.. అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, సప్తగిరి, సుదర్శన్, వైవా హర్ష, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితర కమెడియన్లను చూపించి సినిమాలో బోలెడంత ఫన్ ఉందని చెప్పారు. మొత్తంగా చెప్పాలంటే ఫుల్ ప్యాక్డ్ ఫన్ నింపిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇదని చూపించిన మారుతి సినిమాపై అంచనాలు పెంచేశాడు.