Rowdy Boys: లిప్‌లాక్.. ఘాటు రొమాన్స్.. రూటు మార్చిన అనుపమ?

మిగతా హీరోయిన్స్ స్కర్ట్స్, బికినీలతో సెగలు పుట్టిస్తున్నా.. లిప్స్ లాక్స్, బెడ్ రూమ్ సన్నివేశాలకు కథ డిమాండ్ చేసిందని సై అంటున్నా కొందరు హీరోయిన్స్ మాత్రం వాటికి దూరం ఉంటూ..

Rowdy Boys: లిప్‌లాక్.. ఘాటు రొమాన్స్.. రూటు మార్చిన అనుపమ?

Rowdy Boys

Rowdy Boys: మిగతా హీరోయిన్స్ స్కర్ట్స్, బికినీలతో సెగలు పుట్టిస్తున్నా.. లిప్స్ లాక్స్, బెడ్ రూమ్ సన్నివేశాలకు కథ డిమాండ్ చేసిందని సై అంటున్నా కొందరు హీరోయిన్స్ మాత్రం వాటికి దూరం ఉంటూ వస్తున్నారు. తెలుగులో కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ లాంటి వారు ఈ రెండో జాబితాలో ఉంటారు. కానీ.. ఇప్పుడు అనుపమ కూడా ఈ జావితాలో ఉండేందుకు ఇష్టపడడం లేదా.. రూటు మార్చేసి ఇప్పుడు సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు సిద్దమైందా అనిపిస్తుంది.

Indian 2: తొలిగిన విబేధాలు.. మళ్ళీ సెట్స్ మీదకి భారతీయుడు?

ప్రేమమ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టీ అ ఆ.. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే ఇలా వరసగా సినిమాలతో తెలుగులో సెటిలయ్యేందుకు ప్రయత్నిస్తుంది. అయితే.. ఇన్ని సినిమాలు చేసిన స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోతుంది. అందుకే ఇప్పుడు రూటు మార్చిందని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు దూరంగా ఉన్న రొమాన్స్, లిప్ లాక్ సన్నివేశాలకు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెప్పుకుంటున్నారు.

Raviteja 70: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. 70వ సినిమాకి ముహూర్తం!

అనుపమ ప్రస్తుతం దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ తో రౌడీ బాయ్స్ అనే సినిమా చేస్తుంది. ఇది పక్కా యూత్ ఫుల్ సినిమా కాగా.. ఇందులో రొమాన్స్ కూడా ఎక్కువేనట. ఇందులో ఐదారుసార్లు అదర చుంబనాలతో పాటు బెడ్ రూమ్ సన్నివేశాలు కూడా ఉండగా అనుపమ రెచ్చిపోయి నటించిందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా తర్వాత అనుపమ కెరీర్ స్వింగ్ అవుతుందని.. యంగ్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా మారుతుందని ఈ సినిమా గురించి తెలిసినవారు చెప్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో అనుపమ మార్పు ఎంతవరకు యూజ్ అవుతుందో చూడాలి.