Manchu Lakshmi : మోహన్ లాల్ సినిమాలో మంచు లక్ష్మి ఫిమేల్ లీడ్

ఈ సినిమాలో మంచు లక్ష్మీకి హీరోకి సమానంగా ఉండే ఫిమేల్ లీడ్ పాత్ర ని ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల మంచు లక్ష్మి మోహన్ లాల్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. 'మాన్‌స్టర్' సినిమాతో

Manchu Lakshmi : మోహన్ లాల్ సినిమాలో మంచు లక్ష్మి ఫిమేల్ లీడ్

Manchu Lakshmi

Manchu Lakshmi : మంచు లక్ష్మీ వెండితెరపై కనపడి చాలా కాలం అయింది. తను బయట ఎలా మాట్లాడినా యాక్టింగ్ లో మాత్రం 100 శాతం తన వంతు అవుట్ ఫుట్ ఇస్తుంది. ఇటీవల మంచు లక్ష్మికి క్యారెక్టర్స్ రావట్లేదు. ఒకవేళ వచ్చినా ఆ పాత్రలు తనకి నచ్చట్లేదు. తాజాగా మంచు లక్ష్మి బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా మలయాళం స్టార్ హీరో సరసన ఫీమేల్ లీడ్ ఛాన్స్ కొట్టేసింది.

Puneeth Rajkumar : కన్నడ చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో పునీత్‌కు ఘనంగా నివాళుల కార్యక్రమం

ఇక్కడ చిరంజీవితో సమానంగా మలయాళంలో మోహన్ లాల్ స్టార్ హీరో అయ్యారు. ఇప్పటికి కూడా మలయాళంలో మోహన్ లాల్ సినిమాలు వరుసగా వచ్చి మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇక్కడ యువ హీరోలు ఎంత మంది వచ్చినా చిరంజీవి స్థానం వేరు. అక్కడ మలయాళంలో కూడా మోహన్ లాల్ విషయంలో అంతే. ప్రస్తుతం మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్’ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి రెడీగా ఉంది. దీని తర్వాత మరో సినిమాని కూడా అనౌన్స్ చేశారు.

Bigg Boss 5 : జెస్సి వెళ్ళిపోతూ కంటెస్టెంట్స్ కి సలహాలు.. నువ్వే నా సీక్రెట్ ఫ్రెండ్ అంటూ..

మోహన్ లాల్ హీరోగా ‘మాన్‌స్టర్’ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో మోహన్ లాల్ పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైందని సమాచారం. ఈ సినిమాకి మోహన్ లాల్ ‘మన్యం పులి’ సినిమా దర్శకుడు వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మంచు లక్ష్మీకి హీరోకి సమానంగా ఉండే ఫిమేల్ లీడ్ పాత్ర ని ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల మంచు లక్ష్మి మోహన్ లాల్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. ‘మాన్‌స్టర్’ సినిమాతో మరోసారి మంచు లక్ష్మి వెండితెరపై కనిపించబోతుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.