Puneeth Rajkumar : కన్నడ చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో పునీత్‌కు ఘనంగా నివాళి కార్యక్రమం

తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ పునీత్ రాజ్ కుమార్ కి ఘనంగా నివాళులు అర్పించడానికి ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. కన్నడ సినీ పరిశ్రమ, కర్ణాటకలోని రాజకీయ నాయకులు అంతా కలిసి పునీత్

Puneeth Rajkumar : కన్నడ చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో పునీత్‌కు ఘనంగా నివాళి కార్యక్రమం

Puneeth

Updated On : November 15, 2021 / 2:26 PM IST

Puneeth Rajkumar :  కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణించి ఇన్ని రోజులు కావొస్తున్నా కన్నడ ప్రజలు, ఆయన అభిమానులు ఇంకా పునీత్ ను తలుచుకుంటూ బాధపడుతున్నారు. పునీత్ సమాధి వద్దకి ఇవాళ్టికి కూడా రోజూ వేల సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. కర్ణాటకలో నేటికీ ఏదో ఒక చోట పునీత్ కి నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ పునీత్ రాజ్ కుమార్ కి ఘనంగా నివాళులు అర్పించడానికి ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Bigg Boss 5 : జెస్సి వెళ్ళిపోతూ కంటెస్టెంట్స్ కి సలహాలు.. నువ్వే నా సీక్రెట్ ఫ్రెండ్ అంటూ..

కన్నడ సినీ పరిశ్రమ, కర్ణాటకలోని రాజకీయ నాయకులు అంతా కలిసి పునీత్ కి నివాళి కార్యక్రమాన్ని రేపు అనగా నవంబర్‌ 16న జరపనున్నారు. 3 గంటలపాటు ఈ కార్యక్రమం జరగనుంది. కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో పాటు శాండల్‌ వుడ్‌ ఫిల్మ్‌ నటీనటులు, సాంకేతిక నిపుణుల సంఘాలు కలిసి ‘పునీత్‌ నామన’ పేరుతో ఈ వేడుకలను నిర్వహించనున్నాయి.

Nathy Kihara : బాడీలో ఆ ఒక్క పార్ట్‌కి 13 కోట్ల బీమా చేయించిన హీరోయిన్.. ఆ పార్ట్ ఏంటో తెలుసా??

ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, అధికార, ప్రతిపక్ష నాయకులతో పాటు కన్నడ సినీ పరిశ్రమ అంతా తరలి వస్తుంది. వేరే భాష సినీ పరిశ్రమల నుంచి కూడా కొంతమంది అతిధులు రానున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది హాజరవుతారని అంచనా. ఈ కార్యక్రమంలో పునీత్ పై ప్రత్యేకంగా రాసిన గీతాన్ని ఆలపించనున్నారు. అలాగే ఈ కార్యక్రమ కోసం రేపు కన్నడ చిత్ర పరిశ్రమ అంతా షూటింగ్స్ నిలిపివేసింది.