Manchu Vishnu: ‘జిన్నా’గా మారిన గాలి నాగేశ్వర రావు!

యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గురించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా నెటిజన్లు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు. దానికి కారణం ఈ సినిమాలో....

Manchu Vishnu: ‘జిన్నా’గా మారిన గాలి నాగేశ్వర రావు!

Manchu Vishnu Next Movie Gets Crazy Title

Manchu Vishnu: యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గురించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా నెటిజన్లు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు. దానికి కారణం ఈ సినిమాలో ఇద్దరు హాట్ బ్యూటీలు హీరోయిన్లుగా నటిస్తుండటం. శృంగార తార సన్నీ లియోన్, అందాల బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండటంతో మంచు విష్ణు వారితో ఎలాంటి అల్లరి చేయబోతున్నాడా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాలో విష్ణు పాత్ర పేరు గాలి నాగేశ్వర్ రావు అని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.

Manchu Vishnu: విష్ణు-పాయల్ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ!

దీంతో ఈ సినిమాకు కూడా అదే పేరును టైటిల్‌గా పెడతారని అందరూ భావించారు. అయితే తాజాగా ఈ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే హీరో మంచు విష్ణు, రచయిత కోన వెంకట్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, చోటా కె నాయుడు, దర్శకుడు భాను ఈ సినిమా టైటిల్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా అనౌన్స్ చేశారు. మంచు విష్ణు తొలుత సునీల్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ, తన నెక్ట్స్ మూవీ కోసం ఇద్దరు హీరోయిన్లు కావాలని.. ఆ తరువాత ఓ మంచి కథ కావాలని కోరుతాడు. దీనికి సమాధానంగా సునీల్ కోన పేరును రికమెండ్ చేస్తాడు. వెంటనే కోన రావడం.. తన వద్ద ఉన్న సినిమా కథను విష్ణుకు వినిపించడం జరుగుతుంది.

Manchu Vishnu : సన్నీలియోన్ తో మంచు విష్ణు సరదా ఆటలు.. తోడుగా శివబాలాజీ..

ఇక ఈ సినిమాకు డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్‌లను కోన రిఫర్ చేయగా, వారు కూడా ప్రత్యక్షమవుతారు. అయితే ఈ క్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచు విష్ణును ఓ లెవెల్‌లో ట్రోలింగ్ చేయాలని చూశారు. మీరు మా ప్రెసిడెంట్ అయ్యి ఉండి సినిమాలు చేస్తారా అంటూ మంచు విష్ణును ఆడేసుకున్నారు. అయితే చివరకు ఈ సినిమాకు జిన్నా అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నట్లు వారు నిర్ణయించారు. ఇక ఈ సినిమాలో విష్ణు సరసన ఇద్దరు హాట్ బ్యూటీలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.