Pushpa2: పుష్ప రాజ్‌ను ఢీకొట్టేందుకు మరో బాలీవుడ్ యాక్టర్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ తన కెరీర్ బెస్ట్ బ్లాక్‌బస్టర్....

Pushpa2: పుష్ప రాజ్‌ను ఢీకొట్టేందుకు మరో బాలీవుడ్ యాక్టర్..?

Manoj Bajpayee In Pushpa 2 For That Role

Pushpa2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ తన కెరీర్ బెస్ట్ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రావడం.. అందులో బన్నీ పాత్ర ఊరమాస్‌గా ఉండటంతో ఈ సినిమాకు మాస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Pushpa2: పుష్ప-2 ముగింపు.. దానికి ఆరంభమా?

ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమాకు అదిరిపోయే క్రేజ్ రావడంతో ఇప్పుడు అందరి చూపులు ఈ సినిమా రెండో భాగంపైనే ఉన్నాయి. ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని మొదటి భాగంలోనే రివీల్ చేశారు చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో ఆయన పుష్పరాజ్‌పై ఎలా రివెంజ్ తీసుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే పుష్ప రెండో భాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని సుకుమార్ భావిస్తున్నాడు.

Pushpa2: పుష్ప-2లో మరో బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే?

అందుకే ఈ సినిమాలో మరికొంత మంది నటీనటులను యాడ్ చేస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ నటి ఇంద్రజ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ ఈ సినిమాలో నటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు మరోసారి పుష్ప2 సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనోజ్ బాజ్‌పేయ్ నటిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.