Pushpa2: పుష్ప-2లో మరో బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్...

Pushpa2: పుష్ప-2లో మరో బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే?

Suniel Shetty In Allu Arjun Puhspa 2

Pushpa2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా, ఇందులో బన్నీ ఊరమాస్ అవతరాంలో నటించి మెప్పించాడు. పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప కథ రాగా, ఈ సినిమా మాస్, క్లాస్ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో బన్నీ తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేయడంతో ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్ వద్ద తన తడాఖా చూపించింది.

Pushpa2: పుష్పతో ఐటెం సాంగ్.. ఊ అనేస్తున్న బాలీవుడ్ భామలు!

ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇన్‌స్పెక్టర్ భన్వర్ సింగ్ షెకావత్‌గా ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-ది రూల్’ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, త్వరోలనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి ‘పుష్ప-ది రూల్’ కోసం కొంతమంది స్టార్స్‌ను కొత్తగా ఈ సినిమాలోకి తీసుకోబోతున్నాడట దర్శకుడు సుకుమార్. వారిలో ముందుగా వినిపించిన పేరు నటి ఇంద్రజ. ఓ కీలక పాత్ర కోసం ఆమెను ఈ సినిమాలో తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.

Pushpa2: బన్నీ రెమ్యునరేషన్.. భారీగానే సమర్పయామి?

ఇక తాజాగా మరో ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని కూడా ఈ సినిమాలో తీసుకోబోతున్నారట. భన్వర్ సింగ్ షెకావత్‌కు ఉన్నతాధికారిగా సునీల్ శెట్టి మనకు ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఆయన పాత్ర ఈ సినిమాలో ఓ ట్విస్ట్ ఇస్తుందని.. అది సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందనే విషయం తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా పుష్ప-2 సినిమాలో సునీల్ శెట్టి పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.