Pushpa2: పుష్పతో ఐటెం సాంగ్.. ఊ అనేస్తున్న బాలీవుడ్ భామలు!

అప్పుడు పుష్పలో ఐటమ్ సాంగ్ ఆఫర్ చేస్తే తటపటాయించారు. ఇప్పుడు పుష్ప2 లో ఛాన్స్ వస్తే చిందేయడానికి రెడీఅయ్యారు. అవును.. పార్ట్1 బ్లాక్ బస్టర్ అవడం..

Pushpa2: పుష్పతో ఐటెం సాంగ్.. ఊ అనేస్తున్న బాలీవుడ్ భామలు!

Pushpa2

Pushpa2: అప్పుడు పుష్పలో ఐటమ్ సాంగ్ ఆఫర్ చేస్తే తటపటాయించారు. ఇప్పుడు పుష్ప2 లో ఛాన్స్ వస్తే చిందేయడానికి రెడీఅయ్యారు. అవును.. పార్ట్1 బ్లాక్ బస్టర్ అవడం.. స్పెషల్ సాంగ్ తో సామ్ మ్యాజిక్ చేయడం చూసి.. బాలీవుడ్ గ్లామర్ డాల్స్ పార్ట్2లో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి.. బన్నీతో ఫ్లోర్ మూమెంట్స్ చేసే సిజిలింగ్ చాన్స్ దక్కేదెవరికి..?

Pushpa2: బన్నీ రెమ్యునరేషన్.. భారీగానే సమర్పయామి?

అప్పుడు ఊహూ అనేసారు కానీ.. ఇప్పుడు వెంటనే ఊ అనేస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్స్. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేసేందుకు భామలు.. రెడీఅయిపోతున్నారు. అయితే పుష్ప పార్ట్ 2 ది రూల్ లో స్పెషల్ డాన్స్ చేసే ఛాన్స్ దిశా పఠానిని వరించినట్టు చెప్తున్నారు. దేవీశ్రీ కంపోజ్ చేసిన సిజ్లింగ్ సాంగ్ ఊ అంటావాకు ఫస్ట్ ఛాయిస్ దిశానే.. కానీ అప్పుడు రకరకాల కారణాలు చెప్పి దూరమైన ఈ హీరోయిన్.. పుష్ప2లో మెరిసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Pushpa: ఈసారి బాలీవుడ్ భామతో ఊ అనిపిస్తోన్న పుష్ప..?

సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్.. అదీ అల్లు అర్జున్ సరసన అంటే.. సూపర్ గ్యారంటీ ఉంటుంది. కానీ పుష్ప పార్ట్ 1 టైమ్ లో సమంతా కన్నా ముందు చాలామంది ఈ స్పెషల్ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. జిగేలు రాణి పూజా హెగ్డే నుంచి దిశా పఠానీ, నోరా ఫతేహీ, అనన్యపాండే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వరకు గ్లామర్ క్వీన్స్ ఊ అనలేకపోయారు. చివరికి బన్నీ కాంప్రమైజ్ చేసాక సమంతా ఫ్లోర్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఐటమ్ సాంగ్ మ్యాసివ్ హిట్టై.. సోషల్ మీడియాను షేక్ చేయడం.. నేషవల్ వైడ్ ట్రెండ్ అవడం జరిగిపోయాయి. తనకు సరికొత్త పాపులారిటీ తీసుకొచ్చిన ఊ అంటావా పాటపై సామ్ సంతోషం వ్యక్తం చేసింది కూడా.

Pushpa: పుష్ప-2‌తో హాట్ టాపిక్‌గా మారిన ఇంద్రజ!

పాటలతో పాటూ అసలే అంచనాలు లేకుండా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది పుష్ప ది రైజ్. పార్ట్ 2 ది రూల్ కోసం ఎప్పుడెప్పుడా అని సౌత్ తో పాటూ నార్త్ ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో గ్లామర్ ఎంట్రీ ఇచ్చేందుకు బాలీవుడ్ హీరోయిన్స్ పోటీపడుతున్నారు. వచ్చే నెల నుంచే సెట్స్ పైకెళ్లబోతున్న బన్నీ-సుకుమార్ కాంబో.. ఈ ఏడాది డిసెంబర్ లేదంటే వచ్చే ఏడాది జనవరిలో థియేటర్స్ కొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం బజ్ నడుస్తున్నట్టు దిశా పఠానీ బన్నీతో స్టెప్పులేస్తుందో లేదో చూడాలి.