Pushpa: పుష్ప-2‌తో హాట్ టాపిక్‌గా మారిన ఇంద్రజ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప - ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో మనం చూశాం....

Pushpa: పుష్ప-2‌తో హాట్ టాపిక్‌గా మారిన ఇంద్రజ!

Actress Indraja Becomes Hot Topic With Role In Pushpa 2

Pushpa: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప – ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో మనం చూశాం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించగా, పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను తీర్చిదిద్దారు చిత్ర యూనిట్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమాతో బన్నీ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ పర్ఫార్మెన్స్‌కు జనం ఫిదా అయ్యారు.

Pushpa : ముంబై పోలీసుల మ్యూజిక్ బ్యాండ్.. ‘పుష్ప’ శ్రీవల్లి సాంగ్ రీక్రియేషన్..

అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కవ విజయాన్న అందుకోవడంతో, ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఈ సినిమా రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప – ది రూల్’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే పుష్ప సీక్వెల్ కోసం లొకేషన్స్ వెతుకుతున్నారట చిత్ర యూనిట్. అయితే పుష్ప 2 చిత్రంలో తొలి భాగానికి సంబంధించిన కొన్ని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయట.

అంతేగాక ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో పలువురు కొత్త నటీనటులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప రాజ్ బాల్యానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌లో ఒకప్పటి అందాల భామ ఇంద్రజ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్‌బ్యాక్‌లో ఇంద్రజ పాత్ర ఉంటుందని, అది ఆ సీక్వెన్స్‌లో ప్రాధాన్యత కలిగిన పాత్రగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది నటి ఇంద్రజ.

Pushpa Dialogue: పుష్ప డైలాగ్‌తో ఛాలెంజ్ విసురుతున్న టీమిండియా క్రికెటర్లు

మొత్తానికి పుష్ప 2 చిత్రంలో కొత్త సీక్వెన్స్‌లతో పాటు కొత్త నటీనటులు కూడా ఉండబోతున్నారనేది నిజం. ఇక సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పుష్ప 2 సీక్వెల్ చిత్రంలో బన్నీతో పాటు మిగతా నటీనటులు మరోసారి మనల్ని అలరిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యస్ చేస్తున్నారు.