Pushpa Dialogue: పుష్ప డైలాగ్‌తో ఛాలెంజ్ విసురుతున్న టీమిండియా క్రికెటర్లు

రీసెంట్ గా టీమిండియా క్రికెటర్లు కూడా పుష్ప డైలాగులను ఎంజాయ్ చేస్తూ పోస్టు పెట్టారు. యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, హర్ప్రీత్ బ్రార్ హిందీ డైలాగ్ చెప్పారు.

Pushpa Dialogue: పుష్ప డైలాగ్‌తో ఛాలెంజ్ విసురుతున్న టీమిండియా క్రికెటర్లు

Team India

Pushpa Dialogue: అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ ఎంత ఫ్యామస్ అయిందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో బాగా క్లిక్ అయిన డైలాగ్ పుష్ప అంటే పువ్వు అనుకుంటివా.. ఫైర్.. తగ్గేదేలే. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ అయి దేశం మొత్తం పాపులారిటీ దక్కించుకుంది. సినిమాను చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా డ్యాన్సులతో, డైలాగులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నారు.

రీసెంట్ గా టీమిండియా క్రికెటర్లు కూడా పుష్ప డైలాగులను ఎంజాయ్ చేస్తూ పోస్టు పెట్టారు. యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, హర్ప్రీత్ బ్రార్ హిందీ డైలాగ్ చెప్పారు. బస్సులో టీమ్‌మేట్స్‌తో కూర్చొన్న చాహల్ డైలాగ్ స్టార్ట్ చేశాడు. ‘పుష్ప నామ్ సున్కే ఫ్లవర్ సంజే క్యా.. ఫ్లవర్ నహీ, ఫైర్ హై మై, ఝుకుంగా నహీ(పుష్ప పేరు వినగానే పువ్వు అనుకుంటివా.. పువ్వు కాదు నేను ఫైర్. తగ్గేదేలే’ అని మిగిలిన వాళ్లు అందుకున్నారు.

క్లిక్ అయిన డైలాగ్ దాంతో పాటు టీమిండియా క్రికెటర్లు చెప్పారు. ఇక నెటిజన్లు ఊరుకుంటారా.. సూపరో సూపర్ అంటూ కాంప్లిమెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read Also: పుష్ప సీన్ రీ క్రియేషన్‌తో షేక్ చేస్తున్న నెల్లూరు కుర్రాళ్లు

ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడేందుకు లక్నో చేరుకుంది. అటల్ బీహారీ వాజ్ పేయీ ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా తొలి టీ20 జరగనుంది.