Pushpa2: బన్నీ రెమ్యునరేషన్.. భారీగానే సమర్పయామి?

అల్లు అర్జున్ రెమ్యునరేషన్ టాపిక్ మరోసారి ట్రెండ్ అవుతోంది. పుష్ప కోసం భారీగా అందుకున్న బన్నీ.. పుష్ప2 కోసం అంతకంటే ఎక్కువగానే అకౌంట్ లో వేసుకుంటున్నారు. అంతేనా మరికొన్ని..

Pushpa2: బన్నీ రెమ్యునరేషన్.. భారీగానే సమర్పయామి?

Allu Arjun

Pushpa2: అల్లు అర్జున్ రెమ్యునరేషన్ టాపిక్ మరోసారి ట్రెండ్ అవుతోంది. పుష్ప కోసం భారీగా అందుకున్న బన్నీ.. పుష్ప2 కోసం అంతకంటే ఎక్కువగానే అకౌంట్ లో వేసుకుంటున్నారు. అంతేనా మరికొన్ని దారుల్లో కూడా పుష్పరాజ్ సొమ్ముచేసుకునే పనిలో ఉన్నారు. అయితే నిజంగానే బన్నీ డిమాండ్ చేస్తున్నారా… అదృష్టం అలా కలిసొస్తుందా…?

Pushpa: ఈసారి బాలీవుడ్ భామతో ఊ అనిపిస్తోన్న పుష్ప..?

పుష్ప2 రెమ్యునరేషన్ విషయంలో.. బన్నీ తగ్గేదే లే అంటున్నారనే టాక్ బాగా ట్రెండ్ అవుతోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ కోసం దాదాపు 45 కోట్లు అందుకున్న అల్లు అర్జున్.. సెకండ్ పార్ట్ కోసం సరికొత్త లెక్కలని చెప్తున్నారని అంటున్నారు. అయితే ఇందులో బన్నీ డిమాండ్ ఏమాత్రం లేదని తెలుస్తోంది. పుష్ప అనూహ్య విజయంతో మైత్రీ మూవీ మేకర్స్.. హీరోకి రెమ్యునరేషన్ తో పాటూ ఏ లాంగ్వేజ్ రైట్స్ అయినా తీసుకోమని ఆఫర్ చేస్తున్నట్టు చెప్తున్నారు.

Pushpa: పుష్ప-2‌తో హాట్ టాపిక్‌గా మారిన ఇంద్రజ!

పుష్ప ది రూల్.. హిందీ డబ్బింగ్ రైట్స్ ను అల్లు అరవింద్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఆ లెక్కన చూస్తే పారితోషకంతో పాటూ బాలీవుడ్ లో వచ్చే లాభం అల్లు వారింటికే వెళ్తోంది. లేదూ నిర్మాతలు ఆఫర్ చేసినట్టు మనీతో పాటూ ఎక్కడి రైట్స్ దక్కినా బన్నీకది మంచి డీల్ అన్నట్టే. ఏప్రిల్ నుంచి పుష్ప2 రెగ్యులర్ షూట్ తో బిజీ కాబోతున్నారు సుకుమార్. కంటిన్యూస్ గా వర్క్ జరిగితే ఈ ఇయర్ డిసెంబర్ కే సెకండ్ పార్ట్ ని థియేటర్స్ కి తీసుకొస్తాడు పుష్పరాజ్. ఇక ఏప్రిల్ నెలలోనే ఓ క్రేజీ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమాను ప్రకటించే ఛాన్స్ ఉంది.