Pushpa: ఈసారి బాలీవుడ్ భామతో ఊ అనిపిస్తోన్న పుష్ప..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్....

Pushpa: ఈసారి బాలీవుడ్ భామతో ఊ అనిపిస్తోన్న పుష్ప..?

Bollywood Beauty For Pushpa The Rule Item Song

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నా, వాటిని ఎలివేట్ చేసిన విధానం సూపర్బ్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఇష్టపడ్డారు. ఈ సినిమాలో బోరింగ్ అంశాలు ఏమాత్రం లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. కాగా బన్నీ ఊరమాస్ పర్ఫార్మెన్స్, రష్మిక మందన కిల్లింగ్ లుక్స్, సుకుమార్ అద్భుతమైన టేకింగ్ కలగలిసి ఈ సినిమాను సూపర్ హిట్ చిత్రంగా నిలిపాయి.

Pushpa: పుష్ప-2‌తో హాట్ టాపిక్‌గా మారిన ఇంద్రజ!

‘పుష్ప – ది రైజ్’ చిత్రం అందించిన సక్సెస్‌తో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించి స్క్రిప్టు పనులు పూర్తయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో కొన్ని కొత్త పాత్రలు కూడా యాడ్ కాబోతున్నాయట. ఇదిలా ఉండగా, పుష్ప మొదటి పార్ట్‌లో స్టార్ బ్యూటీ సమంతతో ‘ఊ అంటావా మావా..’’ అంటూ సుకుమార్ తెరకెక్కించిన హాట్ ఐటెం సాంగ్ ఈ సినిమాకు మేజర్ అట్రాక్షన్‌గా నిలిచింది. సమంత తొలిసారి ఇలా అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కించడంతో ఈ పాట సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో కూడా ఓ మాస్ ఐటెం సాంగ్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Pushpa 2: టీమ్ వర్క్ మొదలు పెట్టిన పుష్పరాజ్.. అనుకున్నట్లే రిలీజ్!

ఇక పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న పుష్ప పార్ట్ 2లో ఐటెం సాంగ్‌లో ఎవరిని తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈసారి బాలీవుడ్ నుండి ఓ హాట్ బ్యూటీని ఈ సినిమాలో ఐటెం పాట కోసం తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నాడట. ఇందులో ముఖ్యంగా దిశా పటాని, కృతి సనన్ పేర్లు వినిపిస్తుండటంతో ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు ఐటెం సాంగ్‌లో కనిపిస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే బాలీవుడ్ స్టార్స్ కాకుండా సౌత్ నుండే మరో స్టార్ బ్యూటీని తీసుకుంటే ఈ సినిమాకు బాగా కలిసొస్తుందని పులువురు సుకుమార్‌కు సూచిస్తున్నారు. బాలీవుడ్ భామలు ఐటెం సాంగ్స్ చేయడం రొటీన్ కాబట్టి.. వారితో కాకుండా ఇక్కడే ఎవరైనా క్రేజ్ ఉన్న స్టార్ బ్యూటీతో ఐటెం సాంగ్ చేయిస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా కోరుతున్నారు. బన్నీ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారీ క్యాస్టింగ్‌తో రాబోతున్న ‘పుష్ప – ది రూల్’ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా పట్టాలెక్కి, పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.