Shivanna – Ram Charan : అప్పుడు తండ్రులు.. ఇప్పుడు కొడుకులు.. తెలుగు, కన్నడ ఫ్యాన్స్ కి ట్రీట్.. వీడియో వైరల్..
ఓ ఐకానిక్ మూమెంట్ ని శివన్న - చరణ్ రీ క్రియేట్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Shivanna Ram Charan
Shivanna – Ram Charan : రామ్ చరణ్ జూన్ 4న పెద్ది సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఇటీవల బెంగుళూరులో ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, శివరాజ్ కుమార్, జాన్వీ లతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో ఓ ఐకానిక్ మూమెంట్ ని శివన్న – చరణ్ రీ క్రియేట్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి, ఒకప్పటి కన్నడ స్టార్ హీరో, లెజెండరీ నటుడు, దివంగత రాజ్ కుమార్ మధ్య మంచి స్నేహం ఉంది. ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఎప్పట్నుంచో స్నేహం ఉంది. అప్పట్లో బెంగుళూరు వెళ్తే చిరంజీవికి రాజ్ కుమార్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళని అంటారు. ఓ సినిమా ఈవెంట్లో వీళ్లిద్దరు కలిసి పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో రాజ్ కుమార్ చిరంజీవిని ఆప్యాయంగా దాగరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నారు. ఆ ఫోటోని సరిగ్గా అప్పుడు క్యాప్చర్ చేయకపోయినా ఆ మూమెంట్ ఇప్పటికి మెగా ఫ్యాన్స్ కి గుర్తుంది.
అయితే ఇపుడు ఆ సీన్ ని వారి కొడుకులు శివన్న- చరణ్ రీ క్రియేట్ చేసారు. పెద్ది ప్రమోషన్స్ భాగంగా చేసిన ఇంటర్వ్యూలో యాంకర్.. రాజ్ కుమార్ – చిరంజీవిల ఫోటో చూపించి సీన్ రీ క్రియేట్ చేయమనడంతో శివరాజ్ కుమార్ చరణ్ ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మరోసారి మెగా ఫ్యాన్స్, కన్నడ తెలుగు మ్యూచువల్ ఫ్యాన్స్ వీరి బంధాన్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
History recreated ❤️@AlwaysRamCharan Garu @NimmaShivanna Garu Recreate a Lovely Memory ✨#PEDDI pic.twitter.com/kNxSExAVlK
— PEDDI (@PeddiMovieOffl) May 29, 2026
