Pushpa 2: టీమ్ వర్క్ మొదలు పెట్టిన పుష్పరాజ్.. అనుకున్నట్లే రిలీజ్!

పుష్ప ది రైజ్ పాన్ ఇండియా రేస్ లో దూసుకుపోయింది. టాలీవుడ్ ఫిలిం హిస్టరీలో సాలిడ్ హిట్ నమోదు చేసుకుంది. నెక్స్ట్ పుష్ప ది రూల్ ఎప్పుడెప్పుడా అని పాన్ ఇండియన్ ఆడియన్స్ ఎదురు..

Pushpa 2: టీమ్ వర్క్ మొదలు పెట్టిన పుష్పరాజ్.. అనుకున్నట్లే  రిలీజ్!

Pushpa (1)

Pushpa 2: పుష్ప ది రైజ్ పాన్ ఇండియా రేస్ లో దూసుకుపోయింది. టాలీవుడ్ ఫిలిం హిస్టరీలో సాలిడ్ హిట్ నమోదు చేసుకుంది. నెక్స్ట్ పుష్ప ది రూల్ ఎప్పుడెప్పుడా అని పాన్ ఇండియన్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడప్ చేశారు మేకర్స్. మ్యూజిక్ సెషన్స్ లో బిజీ అయ్యారు దేవిశ్రీ ప్రసాద్ అండ్ సుకుమార్ టీమ్స్. తగ్గేదేలే అంటూ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ గా థియేటర్లో కొచ్చిన పుష్పరాజ్. 50 రోజుల థియేట్రికల్ రన్ ను సాధించి, పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అంటూ పాన్ ఇండియా లెక్కలు మార్చేశాడు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప సెకెండ్ పార్ట్ పైన్నే ఉంది.

Radhe Shyam: థీమ్ పార్టీ.. క్యూరియాసిటీ తెగ పెంచేస్తున్న సరికొత్త ప్రమోషన్!

పుష్ప సాంగ్స్ ఆల్బమ్ అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. యూట్యూబ్ లో తక్కువ టైమ్ పీరియడ్ లోనే 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేశాయి. ఏ సినిమా పాటలకు రానన్ని రీల్స్ పుష్ప సాంగ్స్ పైన వచ్చాయి. పుష్ప ఈ రేంజ్ సక్సెస్ కు మ్యూజిక్ ఆల్బమ్ కీ రోలే ప్లే చేసింది. దేవిశ్రీప్రసాద్ పుష్ప ది రూల్ విషయంలోనూ పార్ట్ 1 కు మించి, వరల్డ్ వైడ్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే ట్యూన్స్ ఇచ్చాడని సమాచారం.

Varun Tej: రెండు సినిమాలతో వస్తోన్న మెగా ప్రిన్స్.. ఛాంపియన్ గెలుస్తాడా?

పాన్ ఇండియాను తన అడ్డాగా మార్చుకున్న పుష్ప ఎక్కడా తగ్గట్లేదు. పుష్ప వచ్చి 50 రోజులు క్రాస్ అయింది. పుష్ప సక్సెస్ వేవ్ చల్లారక ముందే పుష్ప 2ని కూడా ఆడియన్స్ కు రీచ్ చేయాలన్న యాక్షన్ ప్లాన్ తో, ఈ అక్టోబర్ లోనే సినిమా రిలీజ్ చేయాలన్న టర్గెట్ తో పుష్ప ది రూల్ టీమ్ వర్క్ చేస్తోంది. అన్నీ సెట్ అయితే ఈ నెలాఖరులో గాని, మార్చి నెల ఫస్ట్ వీక్ లో గాని షూటింగ్ స్టార్ట్ చేసి, అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది సుకుమార్ టీమ్. పుష్ప కన్నా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు ముత్తం శెట్టి మీడియా అండ్ మైత్రీ మూవీ మేకర్స్. పుష్ప పార్ట్ టూ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియన్ ఆడియన్స్.