Radhe Shyam: థీమ్ పార్టీ.. క్యూరియాసిటీ తెగ పెంచేస్తున్న సరికొత్త ప్రమోషన్!

రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ విషయంలో వెనకబడిందని ఫీలయ్యారు ఫాన్స్. ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. మరి ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉండాలి.

Radhe Shyam: థీమ్ పార్టీ.. క్యూరియాసిటీ తెగ పెంచేస్తున్న సరికొత్త ప్రమోషన్!

Radhe Shyam

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ విషయంలో వెనకబడిందని ఫీలయ్యారు ఫాన్స్. ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. మరి ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉండాలి.. ఆ రేంజ్ ను మ్యాచ్ చేయడానికే రెడీ అయ్యారు మేకర్స్. అందుకే సరికొత్త ప్రమోషన్ చేయడం కోసం రాధేశ్యామ్ టీమ్ ప్రేమికుల రోజునే చూజ్ చేసుకుంది. అసలు ఎందుకు ఆ రోజునే చూజ్ చేసుకున్నారు? కొత్తగా ప్రమోషన్స్ ఏం చేయబోతున్నారన్న సంగతులు ప్రభాస్ ఫ్యాన్స్ కు క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.

Varun Tej: రెండు సినిమాలతో వస్తోన్న మెగా ప్రిన్స్.. ఛాంపియన్ గెలుస్తాడా?

సమ్మర్ సీజన్ లో మార్చి 11న వరల్డ్ వైడ్ గా 10వేల థియేటర్లకు పైగా రిలీజ్ కానున్న రాధేశ్యామ్ రిలీజ్ కు ఇంకా 30 రోజులే టైమ్ ఉంది. రిలీజ్ దగ్గరపడుతున్న క్రమంలో సరికొత్త ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. సౌత్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్ థీమ్ పార్టీ ప్లాన్ చేశారు. హైదరాబాద్ కెమిస్ట్రీ క్లబ్ లో ఈ థీమ్ పార్టీ కోసం సపరేట్ సెట్ వేస్తున్నారు. ఫిబ్రవరి 14న రాత్రి 8 గంటల నుంచి థీమ్ పార్టీ స్టార్ట్ కానుంది.

Devi Sri Prasad: అరగంటలో 6 పాటలు కంపోజ్ చేసిన దేవిశ్రీ.. ఏ సినిమా కోసమంటే?

రాధేశ్యామ్ టీమ్ మొత్తం ఈ పార్టీలో పాల్గొంటున్నారు. ఇలా సరికొత్త థీమ్ పార్టీ ప్రమోషన్స్ తో ఫాన్స్ లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు. రాధేశ్యామ్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు. రాధేశ్యామ్ ఒక పీరియాడికల్ లవ్ స్టోరీ. అందుకే యూత్ ను టార్గెట్ చేసి, థీమ్ పార్టీకి వాలెంటైన్స్ డే నే సరైన రోజుగా చూజ్ చేసుకున్నారు రాధేశ్యామ్ టీమ్.

Aishwarya Rai: లతా మంగేష్కర్ కి ఐష్ నివాళి.. నెటిజన్ల ట్రోల్స్!

లాస్ట్ ఇయర్ లవర్స్ డే రోజున్నే రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ అయ్యింది. సినిమాను కూడా జులై 30న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. కోవిడ్ ప్రభావంతో అప్పుడు పోస్ట్ పోన్ చేసి, సంక్రాంతి బరిలో ఖచ్చితంగా దింపుతామన్నారు. ఈ ఇయర్ సంక్రాంతి సీజన్ జనవరి 14న పక్కా రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు ఫాన్స్. కాని, కోవిడ్ రీజన్ తో మరోసారి రాధేశ్యామ్ రిలీజ్ విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకోక తప్పలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వెనకబడిందని ఫీలవుతున్న ఫాన్స్ కు బూస్టప్ ఇవ్వడానికి ఈ ఇయర్ ప్రేమికుల రోజున థీమ్ పార్టీ చేయబోతున్నారు రాధేశ్యామ్ టీమ్.

Kajal Agarwal : తన అందం, శరీరంపై వచ్చిన కామెంట్లకు ఘాటుగా స్పందిస్తూ.. తల్లి పడే కష్టాన్ని చెప్పిన కాజల్

సాహో ట్రయిలర్ కు మాత్రమే మ్యూజిక్ చేసిన తమన్, రాధేశ్యామ్ ఫుల్ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాడు. ఆడియన్స్ కన్నా ముందు రాధేశ్యామ్, తమన్ ను ఇంప్రెస్ చేసింది. రాధేశ్యామ్ తనను చాలా కాలం తర్వాత ఒక తెలియని ట్రాన్స్ లోకి తీసుకెళ్లిందని చెప్పుకొచ్చి ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాడు. అసలు థీమ్ పార్టీలో రాధేశ్యామ్ టీమ్ ఎలా సందడి చేయబోతున్నారు? రాధేశ్యామ్ లో ప్రభాస్ లవర్ బాయ్ గా ఎలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చాడు?, ప్రభాస్, పూజా హెగ్డే పెయిర్ ఎలా ఉందో, వెంటనే చూసేయాలన్న క్యూరియాసిటీతో పాన్ ఇండియా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.