Devi Sri Prasad: అరగంటలో 6 పాటలు కంపోజ్ చేసిన దేవిశ్రీ.. ఏ సినిమా కోసమంటే?

రాక్ స్టార్ మళ్లీ రఫ్పాడిస్తున్నాడు.. మధ్యలో కాస్త ఢల్ అయినా.. పుష్పతో అందరి ఫ్యూజ్ లు ఎగిరిపోయేటట్టు చేశాడు. ఆ వుడ్ ఈ వుడ్ అని కాదు.. అన్ని భాషల్లో డీఎస్పీ మ్యాజిక్, మ్యూజికల్..

Devi Sri Prasad: అరగంటలో 6 పాటలు కంపోజ్ చేసిన దేవిశ్రీ.. ఏ సినిమా కోసమంటే?

Devi Sri Prasad

Devi Sri Prasad: రాక్ స్టార్ మళ్లీ రఫ్పాడిస్తున్నాడు.. మధ్యలో కాస్త ఢల్ అయినా.. పుష్పతో అందరి ఫ్యూజ్ లు ఎగిరిపోయేటట్టు చేశాడు. ఆ వుడ్ ఈ వుడ్ అని కాదు.. అన్ని భాషల్లో డీఎస్పీ మ్యాజిక్, మ్యూజికల్ లవర్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత అన్ని సూపర్ హిట్ పాటలే ఇచ్చి.. రీసెంట్ టైమ్ లో పుష్ప ఆల్బమ్ ను టాప్ లో నించోబెట్టాడు. సినిమా సక్సెస్ కు స్టార్స్, డైరెక్టర్స్ ఎంత ముఖ్యమో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే కీలకం. అందుకే ఈ మధ్య కాలంలో మ్యూజిక్ సినిమా సక్సెస్ లో కీలకంగా మారిపోయింది.

Aishwarya Rai: లతా మంగేష్కర్ కి ఐష్ నివాళి.. నెటిజన్ల ట్రోల్స్!

ఒకవైపు థమన్.. మరోవైపు దేవిశ్రీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. రీసెంట్ గా థమన్ బ్లాక్ బస్టర్ సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉంటే దేవిశ్రీ కూడా పోటాపోటీగా దూసుకొచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’, రామ్ పోతినేని ‘ది వారియర్’, చిరంజీవి ‘Chiru154’, అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’, వెంకటేష్ & వరుణ్ తేజ్ ల ‘ఎఫ్ 3’, శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి చిత్రాలకు సంగీతం అందిస్తుండగా దేవి శ్రీ అందించిన రవితేజ ఖిలాడీ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది.

Kajal Agarwal : తన అందం, శరీరంపై వచ్చిన కామెంట్లకు ఘాటుగా స్పందిస్తూ.. తల్లి పడే కష్టాన్ని చెప్పిన కాజల్

ఈ మధ్యనే రిలీజ్ చేసిన ఖిలాడీ సాంగ్స్ కు మంచి స్పందనే వస్తుండగా.. సోషల్ మీడియాలో కొందరు పాటలు వినడానికి సోసోగా ఉన్నాయని.. టేకింగ్ వల్ల యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వల్ల వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు. ఎలా వచ్చినా ఖిలాడీ మ్యూజికల్ గా హిట్ అయింది. అయితే.. దేవిశ్రీ ఖిలాడీలోని ఐదు పాటలను కేవలం అరగంటలోనే ట్యూన్స్ ఇచ్చేశాడట. ఈ విషయాన్ని కూడా దర్శకుడు రమేష్ వర్మ స్వయంగా చెప్పాడు.

Chiranjeevi : మళ్ళీ కమర్షియల్ యాడ్స్‌లోకి మెగాస్టార్??

దేవిశ్రీ ప్రసాద్ నాకు 15 ఏళ్ళ నుంచి తెలుసు. కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు స్నేహితులం కాబట్టి సాయంత్రం 6 గంటల నుంచి అవీ ఇవీ ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ.. మిడ్ నైట్ 2 గంటలకు కథ మొదలు పెట్టగా.. పూర్తయ్యేసరికి మూడున్నర నాలుగు గంటలు అయింది. అప్పటికప్పుడు మొదలుపెట్టి దేవిశ్రీ అరగంటలో ఆరు ట్యూన్స్ ఇచ్చాడు. అప్పుడే ట్యూన్స్ అన్నీ ఓకే అనుకున్నాం. తర్వాత పాటలు రికార్డ్ చేసి పంపించారు. దేవీ ఆరు పాటలు ఇచ్చినా సినిమాలో ఐదో పెట్టుకున్నాం. అన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయిని రమేష్ వర్మ చెప్పుకొచ్చారు.