Chiranjeevi : మళ్ళీ కమర్షియల్ యాడ్స్‌లోకి మెగాస్టార్??

ఒకప్పుడు రాజకీయాల్లోకి రాకముందు, సినిమాలకి బ్రేక్ ఇవ్వక ముందు చిరంజీవి కమర్షియల్ గా కూడా చాలా యాడ్స్ చేశారు. చిరంజీవి చేసిన థమ్స్ అప్ యాడ్ అయితే ఎవర్ గ్రీన్. కానీ సినిమాలకి........

Chiranjeevi :  మళ్ళీ కమర్షియల్ యాడ్స్‌లోకి మెగాస్టార్??

Chiranjeevi

Megastar :  మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ తర్వాత మరింత జోష్ గా కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. యువ హీరోలు సైతం చిరంజీవికి పోటీ పడలేకపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో 7 సినిమాలు ఉన్నాయి. అందులో ‘ఆచార్య’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉండగా మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరో మూడు ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్.

ఒకప్పుడు రాజకీయాల్లోకి రాకముందు, సినిమాలకి బ్రేక్ ఇవ్వక ముందు చిరంజీవి కమర్షియల్ గా కూడా చాలా యాడ్స్ చేశారు. చిరంజీవి చేసిన థమ్స్ అప్ యాడ్ అయితే ఎవర్ గ్రీన్. కానీ సినిమాలకి బ్రేక్ ఇచ్చాక కమర్షియల్ యాడ్స్ కి దూరమయ్యారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినట్టే యాడ్స్ లోకి కూడా రీఎంట్రీ ఇవ్వడానికి చిరంజీవి రెడీ అవుతున్నారని సమాచారం.

Akshay Kumar : ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్

ఇప్పటికే చిరంజీవిని ఓ రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా అడగడంతో ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ యాడ్ షూటింగ్ కూడా జరగనుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే మళ్ళీ మెగాస్టార్ కమర్షియల్ యాడ్స్ లో మెరవనున్నారు. చిరంజీవి యాడ్స్ చేస్తున్నారు అంటే కంపెనీలన్నీ చిరంజీవి కోసం క్యూ కట్టడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు.