Tilak Varma : 8 కోట్ల ప్లేయర్‌ను 33 లక్షలకే కొంటారా? ఇది అన్యాయం గురూ!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న TG20 లీగ్ వేలంలో భారత టీ20 వైస్ కెప్టెన్, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (Tilak Varma) రికార్డు ధర పలికారు
Tilak Varma sold for 33 Lakhs in Telangana 20 league auction for Medak Falcons
Tilak Varma : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న TG20 లీగ్ వేలంలో భారత టీ20 వైస్ కెప్టెన్, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ రికార్డు ధర పలికారు. ఆదివారం (జూన్ 7) రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన వేలంలో తిలక్ వర్మ అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు.
రూ. 5 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన తిలక్ వర్మ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్, నల్గొండ నైట్స్ జట్లు పోటీ పడ్డాయి. చివరకు 33 లక్షల భారీ మొత్తానికి మెదక్ ఫాల్కన్స్ జట్టు తిలక్ వర్మను దక్కించుకుంది కాగా.. ఈ వేలంలో ప్రతి జట్టు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కేవలం 60 లక్షల బడ్జెట్‌ను మాత్రమే కేటాయించారు. అందులో సగానికి కంటే ఎక్కువగా ఒక్క తిలక్ వర్మ కోసమే మెదక్ పాల్కన్స్ జట్టు వెచ్చించడం విశేషం.
Rishabh Pant : పంత్ కొట్టిన బంతి డ్రోన్‌ను తాకిందా? వైరల్ వీడియో..
View this post on Instagram
టీజీటీ20 లీగ్ జూన్ 20 నుంచి జూలై 11 వరకు జరగనుంది. మొత్తం 8 ఫ్రాంఛైజీలు క్పపుకోసం పోటీపడనున్నాయి. కాగా.. ఈ లీగ్ జరిగే సమయంలో భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లలో పర్యటించనుంది. తిలక్ వర్మ భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ కావడంతో అతడు టీజీటీ20 లీగ్‌లో అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. అయినప్పటికి కూడా మెదక్ జట్టు అతడి కోసం అంత పెద్ద మొత్తాన్ని వెచ్చించడం గమనార్హం. మరో భారత ఆటగాడు సిరాజ్‌ను 14 లక్షలకు వరంగల్ వారియర్స్ కొనుగొలు చేసింది.
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన తిలక్ వర్మకు 8 కోట్లను ఎంఐ జీతంగా చెల్లించింది. కాగా.. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్లో 8 కోట్లు పొందే ఆటగాడిని 33 లక్షలకే చాలా చవకగా సొంతం చేసుకున్నారని సరదాగా అంటున్నారు.
