Sarkaru Vaari Paata: ట్రైలర్‌తో అంటుకున్న మాస్ ఫైర్.. ఆకాశానికి అంచనాలు!

సర్కార్ వారి పాట ట్రయిలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఒక రకమైన వేవ్ తీసుకొస్తే. మాసివ్ ట్రయిలర్ తో మరింత ఆకట్టుకుంటున్నారు మహేశ్ బాబు.

Sarkaru Vaari Paata: ట్రైలర్‌తో అంటుకున్న మాస్ ఫైర్.. ఆకాశానికి అంచనాలు!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సర్కార్ వారి పాట ట్రయిలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఒక రకమైన వేవ్ తీసుకొస్తే. మాసివ్ ట్రయిలర్ తో మరింత ఆకట్టుకుంటున్నారు మహేశ్ బాబు. ఇక ఈ సినిమా పై రోజు రోజుకీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు ఫ్యాన్స్. అనేక వాయిదాల తర్వాత మే 12న రిలీజ్ కాబోతున్న సర్కార్ వారి పాట సినిమా డిటైల్స్ పై ఓ లుక్కేద్దాం.

Sarkaru Vaari Paata: ఎస్‌వీపీ ట్రైలర్‌లో కనిపించిన ఈ నటి ఎవరో తెలుసా?

వరల్డ్ వైడ్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న సర్కార్ వారి పాట సినిమా మే12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో రెగ్యులర్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా, ఏ రకమైన లుక్ పోస్టర్ రిలీజ్ అయినా వెంటనే వైరలవుతోంది. టీజర్ తో ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేసిన ఈ సినిమా టీమ్. ఇక మెంటల్ మాస్ స్వాగ్ అంటూ 105 మాస్ షాట్స్ తో మహేశ్ బాబు సర్కార్ వారి పాట ట్రయిలర్ రిలీజ్ చేసి, ఫైర్ అంటించారు. ఈ ట్రయిలర్ తోనే సరికొత్త సక్సెస్ వేవ్ క్రియేట్ చేశారు మేకర్స్.

Sarkaru Vaari Paata: ఎస్‌వీపీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ పవర్ స్టార్?

ట్రయిలర్ తో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లోకి తీసుకెళ్లిన టీమ్, నెక్స్ట్ ఈ సినిమా నుంచి ఫోర్త్ సాంగ్ గా మహేశ్, కీర్తి సురేశ్ కాంబోలో మాస్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.. ఆల్రెడీ ఫస్ట్ రిలీజ్ అయిన కళావతి సాంగ్ రెండు నెలల్లోనే 15 కోట్ల కు పైగా వ్యూయర్ షిప్ సాధించి, థమన్ కెరీర్ లో నే ఫాస్ట్ గా, టాప్ మోస్ట్ వ్యూయిర్ షిప్ సాధించిన పాటగా రికార్డ్ సెట్ చేసింది.. పెన్నీ సాంగ్, టైటిల్ ట్రాక్ కూడా సోషల్ మీడియాలో ఆల్ టైమ్ రికార్డు స్తాయిలోనే దూసుకెళ్తున్నాయి.

Sarkaru Vaari Paata: మహేష్ నోట సీఎం జగన్ మాట.. పొలిటికల్ డైలాగ్‌కి లవ్ ఎఫెక్ట్!

ఇంకా మహేశ్ మాత్రం ప్రమోషన్స్ లో పాల్గొననేలేదు. ప్యారిస్ టూర్ ముగించుకొని వచ్చాక మహేశ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పార్టిస్పేట్ చేయనున్నట్టు చెప్తున్నారు మేకర్స్. సో మహేశ్ ప్రమోషన్స్ తో ఇంకెంత రీచ్ పెరుగుతుందో చూడాలని అని లెక్కలేసుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు చాలానే వచ్చాయి. రాధేశ్యామ్, ట్రిపుల్ ఆర్, ఆచార్య లాంటి భారీ బడ్జెట్ సినిమాలు, భారీ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చాయి.. ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అవ్వడంలో అన్నీ సక్సెస్ కాలేకపోయాయి. మరి ఇలాంటి టైమ్ లో సర్కార్ వారి పాట ఓ రేంజ్ లో ఉంటే తప్ప బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ లేదని మూవీ ఎక్స్ పర్ట్స్, క్రిటిక్స్ అంచనాలేస్తుంటే, ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ మాత్రం సర్కార్ వారి పాటను ఓ రేంజ్ లో పొగుడుతున్నారు. సినిమాపైన ఎక్సపెక్టేషన్స్ మరింత పెంచేస్తున్నారు.

Sarkaru Vaari Paata: మెంటల్ మాస్..! సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్.. హైలైట్స్ ఇవే!

స్పెషల్లీ మహేశ్ ఫ్యాన్స్ కు సర్కారు వారి పాట సినిమా పెద్ద ట్రీట్ కాబోతుందని అంటోంది కీర్తి సురేష్. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నటిస్తోన్న కీర్తి, రీసెంట్ గా ఈ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ పరుశురామ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో కలసి డబ్బింగ్ స్టూడియోలో తీసుకున్న ఫోటో షేర్ చేస్తూ ట్విట్టర్ లో ఇలా చెప్పుకొచ్చింది. ఆల్రెడీ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేసిన మహానటి సర్కార్ వారి పాటపై ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.