Chiranjeevi: మెగాస్టార్ దూకుడు.. జెట్ స్పీడ్‌తో సినిమాలు షురూ!

మెగాస్టార్ చిరంజీవి 65 ఏళ్లు వచ్చినా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 43 ఏళ్లైనా ఇంకా యంగ్ స్టార్ లాగే జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నా్డు. మొన్నటి వరకూ ఆచార్య సినిమా షూటింగ్ లో..

Chiranjeevi: మెగాస్టార్ దూకుడు.. జెట్ స్పీడ్‌తో సినిమాలు షురూ!

Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 65 ఏళ్లు వచ్చినా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 43 ఏళ్లైనా ఇంకా యంగ్ స్టార్ లాగే జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నా్డు. మొన్నటి వరకూ ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి.. ఇప్పుడు ఊటీలో చిల్ అవుతూ గాడ్ ఫాదర్ గా మారిపోయాడు. సీనియర్ స్టార్ అయినా సినిమాల విషయంలో మాత్రం యంగ్ హీరోలకంటే ఎక్కువ దూకుడు చూపిస్తున్నారు. ఆల్రెడీ 4 సినిమాల్ని లైన్లో పెట్టిన చిరంజీవి.. వన్ బై వన్ కంప్లీట్ చేస్తున్నాడు.

Manike Mage Hithe: బెంగాలీలో మార్మోగుతున్న ‘దీదీ’ ‘మా మాతి మనుష్‌ హితే’ పాట!

ఇప్పటికే ఆలస్యం అయ్యిందని ఆఘమేఘాల మీద ఆచార్యని కంప్లీట్ చేసిన మెగాస్టార్.. ఈ సినిమా కంప్లీట్ అయ్యిందో లేదో.. మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ ని మొదలుపెట్టేశాడు. మెగాస్టార్ మోహన్ రాజాతో మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ టైటిల్ తో స్టార్టయిన ఈ సినిమా షూటింగ్ ఆళ్రెడీ స్టార్టయినా.. చిరంజీవి బుధవారం జాయిన్ అయ్యాడు. ఊటీలో కూనూర్ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిరంజీవితో పాటు మురళీ మోహన్, గంగవ్వ, సునీల్ తో సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

Love Story: సెన్సిబుల్ లవ్‌స్టోరీ కోసం సిలబస్ మార్చేసిన శేఖర్ కమ్ముల

మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా స్టార్ట్ చేశానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సెప్టెంబర్ 22న గాడ్ ఫాదర్ సినిమా మొదలుపెట్టడమే కాకుండా ఇదే రోజున 43 ఏళ్లనాడు నా కెరీర్ ని స్టార్ట్ చేశానని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈమధ్య సినిమాల డిలే విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్న చిరంజీవి.. వీలైనంత త్వరగా సినిమాలు కంప్లీట్ చెయ్యాలని అందరికీ చెబుతున్నాడట. అంతేకాదు.. మెగాస్టార్ కూడా అసలే మాత్రం బ్రేక్ తీసుకోకుండా మొన్నటి వరకూ ఆచార్య సెట్ లో ఉండి వెంటనే గాడ్ ఫాదర్ కి షిఫ్ట్ అయిపోయాడు.