Love Story: సెన్సిబుల్ లవ్‌స్టోరీ కోసం సిలబస్ మార్చేసిన శేఖర్ కమ్ముల

టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా లవ్ స్టోరీ టాపిక్కే వినిపిస్తోంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా అంటే జనరల్ గానే ఇంట్రస్ట్ ఉంటుంది. అయితే ఈ సినిమాకి ఇంకొన్ని యాడెడ్..

Love Story: సెన్సిబుల్ లవ్‌స్టోరీ కోసం సిలబస్ మార్చేసిన శేఖర్ కమ్ముల

Love Story

Love Story: టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా లవ్ స్టోరీ టాపిక్కే వినిపిస్తోంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా అంటే జనరల్ గానే ఇంట్రస్ట్ ఉంటుంది. అయితే ఈ సినిమాకి ఇంకొన్ని యాడెడ్ ఎట్రాక్షన్స్ ఉన్నాయి. నాగచైతన్య- సాయిపల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల స్కూల్ నుంచి వస్తున్న ఈ సెన్సిబుల్ లవ్ స్టోరీ‌కి సిలబస్ మార్చానంటున్నాడు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న లవ్ స్టోరీ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్.

Big Boss 5: ఏడ్చేసిన లోబో.. లహరి, శ్రీరామ్‌కు పెళ్లి చేసిన హౌస్ మేట్స్!

లాస్ట్ ఇయర్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా లేట్ గా అయినా లేటెస్ట్ గా మంచి పాజిటివ్ వైబ్స్ తో ఆడియన్స్ ముందకొస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న ఈ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీకి ఇంటెన్స్ ఎమోషన్స్ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల ఎక్కువగా చేసేది సింపుల్, సెన్సిబుల్ లవ్ స్టోరీస్ అయినా.. ఈ సారి మాత్రం సిలబస్ మారింది. క్యూట్ లవ్ స్టోరీకి అంతకుమించి స్ట్రాంగ్ మెసేజ్ ని యాడ్ చేశానని చెబుతున్నాడు శేఖర్ కమ్ముల.

Chiranjeevi: మెగాస్టార్ దూకుడు.. జెట్ స్పీడ్‌తో సినిమాలు షురూ!

ఇన్నాళ్లలో ఎప్పుడూ టచ్ చెయ్యని కులాన్ని, సమాజంలో అసమానతల్ని ఈ సినిమా ద్వారా మరోసారి లైమ్ లైట్లోకి తెస్తున్నాడు శేఖర్ కమ్ముల. నాగచైతన్య, సాయిపల్లవి కూడా కెరీర్ లో ఇంతకుముందెప్పుడూ చూడని, చెయ్యని కొత్త క్యారెక్టర్స్ తో కొత్త లుక్ లో ఆడియన్స్ కి కనిపించబోతున్నారు. కథలో నిజాయితీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు లవ్ స్టోరీ టీమ్.

Manike Mage Hithe: బెంగాలీలో మార్మోగుతున్న ‘దీదీ’ ‘మా మాతి మనుష్‌ హితే’ పాట!

అంతేకాదు ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ నుంచి మంచి సపోర్ట్ తో పాటు అమీర్ ఖాన్ కూడా యాడెడ్ ఎట్రాక్షన్ అయ్యారు. దాంతో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఇన్ని హైప్స్ మద్య శేఖర్ కమ్ముల స్కూల్ లో ఈ సారి మారిన సిలబస్ ఆడియన్స్ కి ఎలా రీచ్ అవుతుందో చూద్దాం.