New Smart Phone: Flipkartలో మైక్రోమ్యాక్స్ IN Note 2 సేల్ ప్రారంభం

దేశీయ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ నుంచి IN Note 2 పేరుతో వచ్చిన ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ అమ్మకాలు flipkartలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి.

New Smart Phone: Flipkartలో మైక్రోమ్యాక్స్ IN Note 2 సేల్ ప్రారంభం

Phon

New Smart Phone: దేశీయ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్.. తమ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ రేంజ్ విస్తరణలో భాగంగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. IN Note 2 పేరుతో వచ్చిన ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ అమ్మకాలు flipkartలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. AI కెమెరా, AMOLED డిస్ప్లే వంటి అధునాతన ఫీచర్స్ తో వస్తున్న ఈ IN Note 2 ధర రూ.17,999గా నిర్ణయించగా.. లాంచ్ ఆఫర్ లో కేవలం ₹12,490కే అందుబాటులో ఉంది. బ్లాక్, ఓక్ అనే రెండు కలర్స్ లో లభిస్తున్న ఈ IN Note 2 స్మార్ట్ ఫోన్ లో ఇంకా ఫీచర్స్ ఏమున్నాయంటే..

Also read: Protests in Canada: నిరసనలతో అట్టుడుకుతున్న కెనడా.. కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి ప్రధాని

IN Note 2 ప్రత్యేకతలు:
ఇందులో ప్రధానంగా మీడియా టెక్ హీలియో G95 SoC, ప్రాసెసర్, 30W ఛార్జింగ్, 6.43 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ప్లే వంటి ఫీచర్స్ వినియోగదారులను ఆకట్టుకుంటాయి. వెనుక 48MP + 5MP + 2MP + 2MP క్వాడ్ కెమెరా సెటప్, ముందు 16ఎంపీ కెమెరా ఉన్నాయి. 4GB + 64GB మెమరీ, సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 5000mAh బ్యాటరీతో 30W ఛార్జింగ్ కెపాసిటీతో వస్తున్న ఈ IN Note 2.. 25 నిముషాల్లోనే సగానికి పైగా ఛార్జింగ్ ఇవ్వగలదని సంస్థ తెలిపింది.

Also read: Afghanistan: ఆహార సంక్షోభం.. అవయవాలు అమ్ముకుంటున్న అఫ్ఘాన్ తల్లిదండ్రులు

flipkartతో పాటు మైక్రోమ్యాక్స్ వెబ్ సైట్ లోనూ ఈ IN Note 2 అందుబాటులో ఉంది. flipkart లో కొనుగోలు చేస్తే.. బ్యాంకు, క్రెడిట్ కార్డు ఆఫర్లు కూడా ఉన్నాయి. citi బ్యాంకు క్రిడిట్/డెబిట్ కార్డుదారులకు 10% డిస్కౌంట్ లభిస్తుండగా.. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులకు 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజిలో ₹11,850 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవేకాక EMI, ఇతర సహఉత్పత్తులపైనా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.

Also read: Corona Update: దేశంలో అదుపులోకి మహమ్మారి, కొత్తగా ఎన్ని కేసులంటే?