Nyattu Remake : మరో మలయాళం రీమేక్… పోలీసు పాత్రల్లో ప్రియదర్శి, అంజలి

ఒకప్పుడు తమిళ సినిమాలను ఎక్కువగా తెలుగులో రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా మలయాళ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా మలయాళంలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి.

Nyattu Remake : మరో మలయాళం రీమేక్… పోలీసు పాత్రల్లో ప్రియదర్శి, అంజలి

Nayattu

Nyattu Remake :  ఒకప్పుడు తమిళ సినిమాలను ఎక్కువగా తెలుగులో రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా మలయాళ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా మలయాళంలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. కొత్త కొత్త కథలతో కొత్త ట్యాలెంట్ వస్తుంది. ఈ కొత్త కథలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఇప్పుడు తెలుగులో చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ మలయాళం రీమేక్స్ చేస్తున్నారు. తాజాగా మరో మలయాళ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

Rajinikanth : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సూపర్ స్టార్

మలయాళంలో ఇటీవల వచ్చిన ఓ డిఫరెంట్ సినిమా ‘నయాట్టు’. మలయాళంలో మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించిన సినిమా ఈ సంవత్సరం స్టార్టింగ్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఒక క్యాస్ట్ కి ఉన్న హక్కులని ఎలా దుర్వినియోగం చేశారు? ఆ క్యాస్ట్ వాళ్ళని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారనేది మెయిన్ లైన్. ఒక ఊళ్ళో ఒక రౌడీ షీటర్ ఉంటాడు. అతని క్యాస్ట్ కి రాజ్యాంగం కలిపించిన హక్కుతో అందరి పైనా, పోలీసుల పైన కూడా చెలరేగిపోతాడు. లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులతో అతనికి గొడవ జరుగుతుంది. అనుకోకుండా ఒక రోజు రాత్రి ఆ రౌడీ షీటర్ అనుచరుడి బైక్ ను పోలీస్ జీప్ యాక్సిడెంట్ చేస్తుంది. దాంతో వాడు అక్కడికక్కడే చనిపోతాడు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినా కావాలనే పోలీసులు అలా చేశారని ఆ రౌడీ షీటర్ ప్రచారం చేసి రాజకీయంగా దీన్ని ఇష్యూ చేసి ఆ పోలీసులని ఇరికించడానికి ట్రై చేస్తాడు. దీంతో ఆ పోలీసులని పట్టుకోడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతుంది. ఇలా చేయని నేరానికి కులాలు, రాజకీయాల వల్ల ఇబ్బంది పడే ఎంతో మంది కథని కళ్ళకి కట్టినట్టు చూపించారు.

Adipurush : ‘ఆదిపురుష్’ సినిమాని చిన్న చిన్న సెట్స్ లో తీశారు.. ఎందుకని అడిగితే..

చాలా తక్కువ బడ్జెట్ తో, తక్కువ పాత్రలతో, ట్విస్టులతో సాగిపోతుంది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బన్నీవాసు – విద్యా మాధవి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘పలాసా 1978’, ‘ శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలకి దర్శకత్వం వహించిన కరుణకుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ‘నయాట్టు’ తెలుగు రీమేక్ లో ముఖ్యమైన మూడు పోలీసు పాత్రలకి రావు రమేశ్, అంజలి, ప్రియదర్శిని తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.