Adipurush : ‘ఆదిపురుష్’ సినిమాని చిన్న చిన్న సెట్స్ లో తీశారు.. ఎందుకని అడిగితే..

సినిమా సాంకేతికంగా అత్యున్నతంగా ఉండబోతున్నదని, గ్రాఫిక్‌ వర్క్‌ కీలకంగా ఉంటుందని పేర్కొంది. భారీ బడ్జెట్‌ సినిమాను చిన్న చిన్న సెట్స్‌లో తీస్తుండటంతో ఆశ్చర్యపడ్డాను. దాని గురించి

Adipurush : ‘ఆదిపురుష్’ సినిమాని చిన్న చిన్న సెట్స్ లో తీశారు.. ఎందుకని అడిగితే..

Adipurush

Adipurush :  ప్రభాస్‌ ‘బాహుబలి’ తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. వరుసగా సినిమాలని లైన్ లో పెట్టాడు. అందులో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. రామాయణం ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నామని దర్శకుడు ఓంరౌత్ తెలిపారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీత గా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తయింది. అందులో కృతిసనన్ కి సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా కృతిసనన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి మాట్లాడింది.

Puneeth Rajkumar : పునీత్ మరణ వార్త చెప్తూ లైవ్ లోనే ఏడ్చేసిన న్యూస్ రీడర్.. వైరల్ అవుతున్న వీడియో

కృతిసనన్ ‘ఆదిపురుష్’ సినిమా గురించి మాట్లాడుతూ… ‘ఆదిపురుష్‌’లో భాగం కావడం ఓ జీవితకాలపు అనుభవమని అంది. తొలిసారి ప్రభాస్‌ను సెట్‌లో కలిసినప్పుడు ఆయన చాలా సిగ్గరిగా అనిపించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన అసలు వ్యక్తిత్వం తెలిసింది. సెట్‌లో ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటాడు. తెలుగులో నేను చెప్పే సంభాషణల్లో తప్పులుంటే సరిదిద్దేవాడు. గొప్ప స్టార్‌డమ్‌ కలిగిన హీరో అయినప్పటికీ అందరితో గొరవంగా వ్యవహరించేవాడు అని తెలిపింది.

Vishal : పునీత్ బాధ్యత నేను తీసుకుంటాను : విశాల్

ఇక సినిమా సాంకేతికంగా అత్యున్నతంగా ఉండబోతున్నదని, గ్రాఫిక్‌ వర్క్‌ కీలకంగా ఉంటుందని పేర్కొంది. భారీ బడ్జెట్‌ సినిమాను చిన్న చిన్న సెట్స్‌లో తీస్తుండటంతో ఆశ్చర్యపడ్డాను. దాని గురించి సినిమా టెక్నీషియన్స్ ని అడిగాను. వీఎఫ్‌ఎక్స్‌ ప్రధానం కావడంతో షూటింగ్‌ ఏరియాకు అంత ప్రాముఖ్యత ఉండదని సాంకేతిక నిపుణులు చెప్పారు. సినిమా ఎలా ఉంటుందో తెలియజేసే పెయింటింగ్స్‌ను నేను చూశాను. మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలిగింది అని కృతిసనన్‌ చెప్పింది. కృతి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆదిపురుష్ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగానే ఉంటాయని అర్ధమవుతుంది. అంతే కాక ఈ సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.