Blakrishna : బాలకృష్ణ సినిమాలో విలన్ గా చేయడానికి నేను రెడీ : మోహన్ బాబు

ఈ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నడిచింది. బాలకృష్ణ తెరపై హీరోగా తప్ప వేరే పాత్రల్లో కనిపించరు. స్పెషల్ గెస్ట్ గా కూడా కనపడరు. కాని బాలకృష్ణ మోహన్ బాబు మాటను కాదనలేక

Blakrishna : బాలకృష్ణ సినిమాలో విలన్ గా చేయడానికి నేను రెడీ : మోహన్ బాబు

Balayya

Blakrishna : బాలకృష్ణ మొదటి సారి వ్యాఖ్యాతగా చేస్తున్న షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఈ షో ప్రసారమవుతోంది. దీపావళి సందర్భంగా నిన్న బాలకృష్ణ చేసిన తొలి ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది. ఈ షోలో బాలయ్య బాబు తొలి ఇంటర్వ్యూ డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో చేశారు. బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు మోహన్‌బాబు తనదైన శైలిలో ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. తన సినిమాలు, రాజకీయ ప్రయాణంతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఈ వేదిక ద్వారా మోహన్ బాబు తెలిపారు. ఇద్దరి మధ్య చాలా సరదాగా ఈ ప్రోగ్రాం నడిచింది. మోహన్ బాబు జీవితంలోని ఎన్నో విషయాలని ఈ షో ద్వారా బాలకృష్ణ తెలియచేసారు. ఆద్యంతం ఈ మొదటి ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా, నవ్వులతో సాగింది. షో చివర్లో మంచు విష్ణు, మంచు లక్ష్మిలు కూడా జాయిన్ అయ్యారు.

NTR : తనయులతో ఎన్టీఆర్ దీపావళి స్పెషల్ పిక్

ఈ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నడిచింది. బాలకృష్ణ తెరపై హీరోగా తప్ప వేరే పాత్రల్లో కనిపించరు. స్పెషల్ గెస్ట్ గా కూడా కనపడరు. కాని బాలకృష్ణ మోహన్ బాబు మాటను కాదనలేక గతంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. మోహన్ బాబు ఫ్యామిలీతో ఉన్న స్నేహం కారణంగా ఆ సినిమాలో ఆత్మగా కనిపించరు బాలయ్య. ఈ విషయాన్ని షోలో ప్రస్తావించారు. మోహన్ బాబు కూడా దీని గురించి మాట్లాడుతూ బాలకృష్ణ హీరోగా చేసే సినిమాలో తాను విలన్ గా చేయడానికి తనకి ఎలాంటి ఇబ్బందీ లేదని, తాను సిద్ధమేనని తెలిపారు. గతంలో కూడా మోహన్ బాబు చాలా సినిమాల్లో విలన్ గా నటించారు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.