OTT Films: తగ్గేదేలే.. వచ్చే వారం ఓటీటీలో రచ్చ రచ్చే!

ఈ వారం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, అద్భుతం.. బాలీవుడ్ నుండి ధమాకా, సినిమా క్యాష్, పొన్ మాణిక్యవేల్, చురులీ, ది మైండ్ ఎక్స్ ప్రెస్ సీజన్ 2, యువర్ హానర్ సీజన్ 2, టైగర్ కింగ్ సీజన్ 2 సందడి చేస్తుండగా వచ్చే వారం కూడా తగ్గేదేలే అంటున్నాయి ఓటీటీలు.

OTT Films: తగ్గేదేలే.. వచ్చే వారం ఓటీటీలో రచ్చ రచ్చే!

Ott Films (1)

OTT Films: ఈ వారం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, అద్భుతం.. బాలీవుడ్ నుండి ధమాకా, సినిమా క్యాష్, పొన్ మాణిక్యవేల్, చురులీ, ది మైండ్ ఎక్స్ ప్రెస్ సీజన్ 2, యువర్ హానర్ సీజన్ 2, టైగర్ కింగ్ సీజన్ 2 సందడి చేస్తుండగా వచ్చే వారం కూడా తగ్గేదేలే అంటున్నాయి ఓటీటీలు. సీనియర్ స్టార్ వెంకీ తన రెండో దృశ్యాన్ని నెక్ట్స్ వీక్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక డిజిటల్ ప్లాట్ ఫాంపై ఆకాశ్ పూరీ రొమాంటిక్ రచ్చ కూడా షురూ కాబోతుంది. వీటితో పాటూ ఇంకా ఏం ఏం సినిమాలు ఇండియన్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయో ఓసారి చూద్దాం.

Nikki Tamboli: ఫోజులతోనే పిచ్చెక్కించే నిక్కీ!

సీనియర్ స్టార్ దృశ్యం 2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. నిజానికి కొవిడ్ తర్వాత థియేటర్స్ లో సినిమాల సందడి చూసి.. దృశ్యం 2 కూడా థియేటర్స్ కే వస్తుందనుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ సడెన్ గా ఓటీటీ ఎంట్రీ ఇస్తుందన్నారు నిర్మాత సురేశ్ బాబు. ఇక ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వకుండా దృశ్యం 2ను రిలీజ్ చేసేస్తున్నారు. సినిమా హాళ్లలో దృశ్యం ఫస్ట్ పార్ట్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పటికే రిలీజైన దృశ్యం 2 మలయాళ వర్షన్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ తెలుగు ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండటంతో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి ప్రేక్షకుల్లో.

OTT Films: ఈ వారం అరడజను సినిమాలు.. ఫుల్ మీల్స్ ఇస్తున్న ఓటీటీలు!

ఎంతో బజ్ క్రియేట్ చేసి గత నెలలో థియేటర్స్ లో సందడి చేసింది రొమాంటిక్. కొడుకు ఆకాశ్ కోసం పూరీ జగన్నాథ్ ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేయడమే కాదు..ప్యాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లను ప్రచార బరిలో దింపారు. ఇప్పుడా రొమాంటిక్ ఆహా లోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. నవంబర్ 26న స్ట్ర్ట్రీమింగ్ కాబోతుంది. కేతిక శర్మా అందాలు, రమ్యకృష్ణ అట్రాక్షన్, పూరీ మార్క్ డైరెక్షన్ వంటివి ఈ మూవీకి కలిసొచ్చిన అంశాలు.

Tollywood Star Hero’s: అభిమానులపై ప్రేమ కురిపిస్తోన్న హీరోలు!

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత రిలీజైన ఆయన సినిమా రిపబ్లిక్. తనకు తాను పబ్లిసిటీ చేసుకోపోయినా.. మెగా మేనమామలు రంగంలోకి దిగి రిపబ్లిక్ ను థియేటర్స్ లో రిలీజ్ చేశారు. పొలిటికల్ డ్రామా కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, రమ్యకృష్ణ, జగపతి బాబు లాంటి స్టార్ కాస్ట్ ఉంది. ఇక ఈ సినిమా జీ5 యాప్ లో నవంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కి రెడీఅయింది. సైకలాజికల్ హారర్ ఫిల్మ్ గా రాబోతుంది ఛోరీ. 8 నెలల ప్రెగ్నెంట్ కి ఎదురయ్యే వింత అనుభవాలతో ఈ సినమా తెరకెక్కింది. నుశృత్ భరుచా లీడ్ రోల్ చేసింది ఈ మూవీలో. ఇప్పటికే రిలీజైన ఛోరీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.