Dussehra Telugu Films: థియేటర్‌లలో మొదలైన బ్యాచిలర్ పెళ్లి సందడి!

దసరాకి ధియేటర్లో సందడి చెయ్యడానికి రెడీ అయ్యాయి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లిసందడి. భారీ హైప్స్ తో చాలా కాలం నుంచి హోల్డ్ లో ఉన్న ఈ సినిమాలు ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని..

Dussehra Telugu Films: థియేటర్‌లలో మొదలైన బ్యాచిలర్ పెళ్లి సందడి!

Dussehra Telugu Films

Dussehra Telugu Films: దసరాకి ధియేటర్లో సందడి చెయ్యడానికి రెడీ అయ్యాయి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లిసందడి. భారీ హైప్స్ తో చాలా కాలం నుంచి హోల్డ్ లో ఉన్న ఈ సినిమాలు ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకుంటాయో లేదో కానీ అసలు ఈ సినిమాలలో ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి.

Big Boss 5: అర్ధరాత్రి మానస్ దుప్పట్లో పింకీ.. బీబీ హౌస్‌లో మూడుముక్కలాట!

ఇప్పుడు రిలీజ్.. అప్పుడు రిలీజ్ అంటూ చాలా కాలం నుంచి ధియేటర్లోకి రావడానికి వెయిట్ చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లిసందడి సినిమాలు ఫైనల్లీ ఈ దసరా పండగ రోజు ధియేటర్లోకి వచ్చేశాయి. ఫస్ట్ టైమ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న రోషన్ తో పాటు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ సినిమా మీద ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

అఖిల్, పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియన్స్ వెయిట్ చెయ్యడానికి మెయిన్ రీజన్.. ఫస్ట్ టైమ్ పెయిర్ అప్ అవుతున్న అఖిల్, పూజా. స్టార్ హీరోయిన్ గా ఒక మెట్టు పైనే ఉన్న పూజా.. ఇంకా సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న అఖిల్ మధ్య కెమిస్ట్రీ కూడా సూపర్ గా ప్లాన్ చెయ్యడంతో ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అక్టోబర్ 15న ధియేటర్లోకి వచ్చింది.

Telugu New Films: దసరాకు అరడజను సినిమాలు.. 200 కోట్ల టార్గెట్!

20 ఏళ్లక్రితం రాఘవేంద్రరావు డైరెక్షన్లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ అయిన పెళ్లిసందడి సినిమా టైటిల్ తో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి డైరెక్షన్లో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా పెళ్లిసందడి. రాఘవేంద్రరావు ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో క్యారెక్టర్ చెయ్యడం, రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమా మీద ఫస్ట్ నుంచి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అవే హైప్స్ తో ఈ పెళ్లిసందడి కూడా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.