Moto G62 Price Cut : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G62 ధర తగ్గిందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ 5G ఫోన్ కొనాల్సిందే.. మరెన్నోక్యాష్‌బ్యాక్ ఆఫర్లు!

Moto G62 Price Cut India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే ఛాన్స్.. (Lenovo) యాజమాన్యంలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మిడ్-రేంజ్ మోటోరోలా (Motorola) మోటో G62 5G స్మార్ట్‌ఫోన్‌ ధరను అమాంతం తగ్గించింది.

Moto G62 Price Cut : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G62 ధర తగ్గిందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ 5G ఫోన్ కొనాల్సిందే.. మరెన్నోక్యాష్‌బ్యాక్ ఆఫర్లు!

Moto G62 price cut in India _ Moto G62 receives price reduction in India

Moto G62 Price Cut : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే ఛాన్స్.. (Lenovo) యాజమాన్యంలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మిడ్-రేంజ్ మోటోరోలా (Motorola) మోటో G62 5G స్మార్ట్‌ఫోన్‌ ధరను అమాంతం తగ్గించింది. ఈ 5G ఫోన్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే, ఇప్పుడే కొనేసుకోండి. ప్రస్తుతం ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రెండింటిపై ధరను తగ్గించినట్టు కంపెనీ వెల్లడించింది.

మోటో G62 కొత్త ధర, ఆఫర్లు ఇవే :
ఆగస్ట్ 2022లో లాంచ్ అయిన Moto G62 5G మోడల్ రెండు RAM వెర్షన్‌లలో 6GB, 8GBలలో అందుబాటులో ఉంది. దీని ధర వరుసగా రూ. 17,999, రూ. 19,999గా ఉంది. 6GB RAM వేరియంట్‌పై రూ. 2వేలు తగ్గింది. ఇప్పుడురూ.15,999కి మోటో G62 కొనుగోలు చేయవచ్చు. 8GB వేరియంట్ ధర రూ. 5వేలు తగ్గింది. అంటే.. రూ. 16,999కి కొనుగోలు చేయవచ్చు.

Read Also : Vijay Sales Women’s Day Sale : విజయ్ సేల్స్ మహిళా దినోత్సవం సేల్స్.. ఐఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లపై అదిరే డిస్కౌంట్లు.. తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా!

ఈ 5G-రెడీ స్మార్ట్‌ఫోన్ కోసం వినియోగదారులు మిడ్‌నైట్ గ్రే, ఫ్రాస్టెడ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లతో ఎంచుకోవచ్చు. మోటోరోలా కంపెనీ తన కొనుగోలుదారులకు ఆఫర్‌లను కూడా అందిస్తోంది. Mobikwik ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ.1,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు Moto G62పై రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు..

Moto G62 price cut in India _ Moto G62 receives price reduction in India

Moto G62 Price Cut _ Moto G62 receives price reduction in India

Moto G62 స్పెసిఫికేషన్‌లు :
మోటో G62 ఫోన్ ఆక్టా-కోర్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో 8GB వరకు RAMతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. మైక్రో SD కార్డ్‌ ద్వారా 1TB వరకు మెమెరీని పొడిగించవచ్చు. Moto G62 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో కూడా కలిగి ఉంది. 5Gకి సపోర్ట్ చేసే మోటోరోలా స్మార్ట్‌ఫోన్ My UX లేయర్‌తో Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

మోటో G62 హైబ్రిడ్ డ్యూయల్ సిమ్‌కు సపోర్టు ఇస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో f/1.8 ఎపర్చరుతో 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 ఎపర్చరుతో 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, f/2.4 ఎపర్చర్‌తో 2MP మాక్రో షూటర్ ఉన్నాయి. ముందు భాగంలో ఈ ఫోన్ f/2.45 ఎపర్చర్‌తో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. Moto G62 IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. మోటో స్ప్లాష్ నిరోధకతను అందిస్తుంది. 5000mAh బ్యాటరీతో వచ్చింది. 20W టర్బోచార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : iPhone SE 4 Launch : అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ SE 4 మోడల్ ఇదిగో.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!