Balakrishna : మూడు నెలల్లో సినిమా తీసేద్దాం.. సుక్కు డైరెక్షన్ లో బాలయ్య

ఆరేసుకోబోయి పారేసుకున్నాను లాంటి ఫుల్ కమర్షియల్ సినిమా తీస్తారా మాతో అని బాలయ్య అడగడంతో మీకు ఓకే అంటే నాకు ఓకే అని..................

Balakrishna : మూడు నెలల్లో సినిమా తీసేద్దాం.. సుక్కు డైరెక్షన్ లో బాలయ్య

Balayya Sukku

Balakrishna :    బాలయ్య బాబు గత కొన్ని రోజులుగా మంచి జోష్ లో ఉన్నారు. ఒకపక్క ‘అఖండ’ సినిమా భారీ విజయాన్ని ఆస్వాదిస్తూ మరో వైపు ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోతో అందర్నీ అలరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో చాలా మంది సెలబ్రిటీలని తీసుకొచ్చి ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించారు. తాజాగా ‘పుష్ప’ సినిమా టీం ఈ షోకి వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ‘పుష్ప’ సినిమా ఇటీవల ‘అఖండ’ తర్వాత రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. తాజాగా సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోకి హాజరయ్యారు.

ఇక ఎప్పటిలాగే బాలకృష్ణ తన స్టైల్ లో ఫుల్ పంచులతో, ఎంటర్టైన్మెంట్ తో అలరించారు. షోకి గెస్ట్ గా వచ్చిన సుకుమార్ తో ఫుల్ గా కామెడీ చేశారు. సుకుమార్ లెక్కల మాస్టర్ అవ్వడంతో బాలకృష్ణ ఒక ఫార్ములా చెప్పి దాని రిజల్ట్ 1. అంటే నేనే అంటూ నవ్వించారు. ఇక సుకుమార్ మీరు అన్నీ ఎక్కువ తెలివితేటలు ఉండే సినిమాలు తీస్తారు. మీ కమర్షియల్ జోనర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను లాంటి ఫుల్ కమర్షియల్ సినిమా తీస్తారా మాతో అని బాలయ్య అడగడంతో మీకు ఓకే అంటే నాకు ఓకే అని అన్నారు సుకుమార్.

Ram Charan : రామ్ చరణ్ ఎక్కువగా ఏం తింటాడో తెలుసా??

అయితే మూడు నెలల్లో సినిమా తీసేద్దాం నేను రెడీ అన్నారు బాలయ్య. తగ్గేదేలే అంటూ మీరు ఫిక్స్ అవ్వండి మూడు నెలల్లో బొమ్మ పడాలి అని అన్నారు బాలకృష్ణ. సుకుమార్ కూడా ఓకే సర్ తీసేద్దాం అని అన్నారు. ఇది నిజంగా జరుగుతుందో లేదో తెలీదు కానీ సుకుమార్ డైరెక్షన్ లో బాలయ్య బాబు సినిమా చేస్తే అది వేరే లెవెల్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. బాలకృష్ణ సుకుమార్ కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా వస్తుందేమో చూడాలి మరి. ఇక తర్వాత వచ్చిన రష్మిక పై కూడా పంచులు విసిరారు బాలయ్య. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప’ సినిమాలోని డైలాగ్ చెప్పారు.