Ram Charan : రామ్ చరణ్ ఎక్కువగా ఏం తింటాడో తెలుసా??

ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రామ్ చరణ్ ఓ ఫుడ్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇందులో సినిమాతో పాటు చాలా విషయాలని పంచుకున్నారు. తాను ఏమేమి ఎక్కువగా తింటాడో, ఏమి తినడో...........

Ram Charan : రామ్ చరణ్ ఎక్కువగా ఏం తింటాడో తెలుసా??

Ram Charan Food

Updated On : December 26, 2021 / 8:38 PM IST

Ram Charan :   రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురూ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని దేశమంతటా ప్రమోట్ చేస్తున్నారు. ముందునుంచి ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నా ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 7న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్ర బృందం.

అన్ని భాషల్లోనూ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే ముంబైలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు. వరుస ఈవెంట్లు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. టెలివిజన్ షోలకి కూడా హాజరవుతున్నారు. విడివిడిగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా సినిమాని ప్రమోట్ చేయడానికి చూస్తున్నారు ‘ఆర్ఆర్ఆర్’ టీం.

Ram Charan : అల్లు రామలింగయ్య 15 రోజులు జైల్లో ఉన్నారు : రామ్ చరణ్

తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రామ్ చరణ్ ఓ ఫుడ్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇందులో సినిమాతో పాటు చాలా విషయాలని పంచుకున్నారు. తాను ఏమేమి ఎక్కువగా తింటాడో, ఏమి తినడో కూడా తెలిపాడు.

Esther Anil : ‘దృశ్యం’ సినిమా పాప ఇప్పుడు ఎలా ఉందో చూడండి

రామ్ చరణ్ స్వీట్స్‌ కంటే కారంగా ఉండేవే ఎక్కువగా తింటాడని, అవే ఎక్కువ ఇష్టమని అన్నారు.
మెగా ఫ్యామిలీలో అందరికంటే ఎక్కువగా స్పైసీ తినేది తనే అని తెలిపాడు.
మాంసాహారం కంటే శాకాహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్నాడు.
హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టమని అన్నాడు.
ఇక మెగా ఫ్యామిలీలో ఫేమస్‌గా చెప్పుకొనే ‘చిరుదోశ’ అంటే బాగా ఇష్టమని, మా అమ్మ చేసిన ప్రతిసారీ బాగా తింటానని తెలిపాడు.
మొక్కజొన్న అంటే అస్సలు ఇష్టం ఉండదని, తినే వంటల్లో అది ఉండకుండా చూసుకుంటానని చెప్పాడు.
ఇక ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా వంటింట్లో గరిటె తిప్పుతానని కూడా చెప్పాడు రామ్ చరణ్.