Movie Promotions : కొత్త పుంతలు తొక్కుతున్న ప్రమోషన్స్.. యాంకర్స్ ని సైడ్ చేసేస్తున్నారుగా

సినిమా ఈవెంట్, సినిమా ఇంటర్వ్యూ చేయాలంటే ఒకప్పుడు యాంకర్స్ కచ్చితంగా ఉండే వాళ్ళు. తెలుగులో యాంకర్ సుమ అన్ని ఈవెంట్లని కవర్ చేస్తూ, ఇంటర్వ్యూలు కూడా చేస్తూ టాప్ పొజిషన్ లో............

Movie Promotions : కొత్త పుంతలు తొక్కుతున్న ప్రమోషన్స్.. యాంకర్స్ ని సైడ్ చేసేస్తున్నారుగా

Anchors

Movie Promotions :  ఇటీవల సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సినిమాని ఎంత వైవిధ్యంగా ప్రమోట్ చేస్తే అంత రీచ్ వస్తుందని నమ్మతున్నారు. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అందరూ సినిమా ప్రమోషన్ కోసం ఎంతదూరమైనా వెళ్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్, ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, వీడియో బైట్లు, ఫ్యాన్స్ తో చిట్ చాట్లు… ఇలా రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ యాంకర్లకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు.

సినిమా ఈవెంట్, సినిమా ఇంటర్వ్యూ చేయాలంటే ఒకప్పుడు యాంకర్స్ కచ్చితంగా ఉండే వాళ్ళు. తెలుగులో యాంకర్ సుమ అన్ని ఈవెంట్లని కవర్ చేస్తూ, ఇంటర్వ్యూలు కూడా చేస్తూ టాప్ పొజిషన్ లో ఉంది. ఒక్కోసారి కొన్ని ఈవెంట్స్ కి డేట్స్ కూడా కేటాయించలేనంత బిజీగా ఉంది సుమ. ఇక యాంకర్ శ్రీముఖి, గీతాభగత్, శ్యామల, రవి, మంజూష, భార్గవి.. లాంటి యాంకర్స్ అప్పుడప్పుడు కొన్ని సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తారు. సుమ లేకపోతేనే వీరి దాకా వెళ్తారు. లేదా చిన్న సినిమాలు వీరిని చూసుకుంటాయి.

అయితే ఇటీవల వీళ్ళని కూడా పక్కన పెడుతున్నారు. గత కొన్ని రోజులుగా మనం గమనిస్తే కొన్ని ప్రమోషన్లు యాంకర్లు లేకుండానే జరుగుతున్నాయి. మరి కొన్నిటికి యాంకర్లు కాకుండా హీరోలు, డైరెక్టర్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ తో చిట్ చాట్ లాంటి ఈవెంట్స్ పెట్టినప్పుడు డైరెక్ట్ గా హీరోలే మైక్ తీసుకొని మాట్లాడుతున్నారు. అక్కడ ఎలాంటి యాంకర్స్ ని పెట్టట్లేదు. ఇటీవల ప్రభాస్ `రాధేశ్యామ్` సినిమాకి హీరో నవీన్ పొలిశెట్టి యాంకర్ గా చేశారు. అలాగే రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో రాజమౌళి ప్రభాస్ ని ఇంటర్వ్యూ చేశారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా టైంలో కమెడియన్ అభినవ్ గోమఠంతో ఇంటర్వ్యూ చేయించారు చిత్ర యూనిట్. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లోను కొన్ని చోట్ల రాజమౌళి లీడ్ తీసుకొని మాట్లాడారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో, కీరవాణితో స్పెషల్ ఇంటర్వ్యూ చేయించారు. మొన్న ఆచార్య సినిమాకి కూడా డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఒక ఇంటర్వ్యూ, యువ డైరెక్టర్స్ తో చిట్ చాట్ అంటూ ఇంకో ఇంటర్వ్యూ చేశారు చిరంజీవి. సాధారణంగా అయితే ఈ ఇంటర్వ్యూలు అన్ని యాంకర్స్ చేయాలి.

Pawan kalyan : ఇకపై పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేయను.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..

 

కానీ వేరే హీరోలు, కమెడియన్స్, డైరెక్టర్స్ చేస్తే వాళ్ళ అభిమానులకి కూడా చూసి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని సినిమా వాళ్ళు భావిస్తున్నారు. దీంతో యాంకర్స్ ని సైడ్ చేసేస్తున్నారు. అంతే కాకుండా యాంకర్స్ కి సపరేట్ గా మనీ ఇవ్వాలి. అదే డైరెక్టర్స్, హీరోలు, ఆ సినిమాలో పని చేసిన వాళ్ళు అయితే స్నేహం మీద ఫ్రీగా వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. అందుకే ఇటీవల చాలా మంది యాంకర్స్ ని సైడ్ చేసి డైరెక్టర్స్, హీరోలు, కమెడియన్లతో ఇంటర్వ్యూలు చేయిస్తున్నారు. కొన్ని ప్రమోషన్స్ ఈవెంట్స్ అసలు యాంకర్స్ లేకుండానే చేసేస్తున్నారు.

Upasana : 150 వృద్ధాశ్రమాలకు అండగా నిలవనున్న ఉపాసన

దీంతో కొంతమంది యాంకర్లు ఈ విషయంలో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే సుమ ఉన్నంతవరకు పెద్ద సినిమాల ఈవెంట్లు మనకి రావు అని కొంతమంది యాంకర్లు ఫిక్స్ అయిపోయారు కూడా. ఈ మాటలని బహిరంగంగానే అన్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రమోషన్స్ చేస్తుండటంతో వచ్చే రెండు, మూడు వర్క్స్ కూడా పోతున్నాయి అని యాంకర్స్ అనుకుంటున్నారట. భవిష్యత్తులోనూ ఇదే జరుగుతుంది, ఎవరి సినిమాకి వాళ్ళు ఎక్కువ రీచ్ అవ్వడానికే చూసుకుంటారు అని అంతా భావిస్తున్నారు.