Upasana : 150 వృద్ధాశ్రమాలకు అండగా నిలవనున్న ఉపాసన

 మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాక, ఎన్నో సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ............

Upasana : 150 వృద్ధాశ్రమాలకు అండగా నిలవనున్న ఉపాసన

Upasana

Upasana : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాక, ఎన్నో సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ, తన ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా హెల్త్ కి సంబంధించిన విషయాలు తెలియచేస్తూ ఎంతోమందికి ఉపయోగపడుతున్నారు. తమ అపోలో హాస్పిటల్ ఫౌండేషన్ తరపున ఎంతోమందికి చేయూతనిస్తున్నారు ఉపాసన. గతంలోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి మనసున్న మనిషిగా అందరిచే ప్రశంసించబడ్డారు.

Mithun Chakraborty : ఆసుపత్రిలో చేరిన ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో

తాజాగా మరో సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందరికి ఆదర్శంగా నిలిచారు ఉపాసన. బిలియన్‌ హార్ట్స్‌ బీటింగ్‌ ఫౌండేషన్‌ ద్వారా జతకట్టి తమ అపోలో ఫౌండేషన్ నుంచి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 150 వృద్ధాశ్రమాలకు అండగా నిలవనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ, తమిళనాడు, కర్ణాకట, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 150 వృద్ధాశ్రమాలలో ఉన్న వయో వృద్ధులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి నెలా వీటిని అందించనున్నారు. దీంతో ఉపాసన చేసిన మంచిపనికి మరోసారి అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.