Movies : ఈ వారం థియేటర్ / ఓటిటిల్లో విడుదల అయ్యే సినిమాలు ఇవే

ప్పట్లో పండగలు ఏమి లేకపోవడంతో పెద్ద హీరోలు గ్యాప్ తీసుకున్నారు. గత వారం నుండి ఈ గ్యాప్ లో చిన్న హీరోలంతా తమ సినిమాలతో వచ్చేస్తున్నారు. చిన్న చిన్న సినిమాలు కూడా ఇప్పుడే...

Movies : ఈ వారం థియేటర్ / ఓటిటిల్లో విడుదల అయ్యే సినిమాలు ఇవే

Movies

Movies :  ఇప్పట్లో పండగలు ఏమి లేకపోవడంతో పెద్ద హీరోలు గ్యాప్ తీసుకున్నారు. గత వారం నుండి ఈ గ్యాప్ లో చిన్న హీరోలంతా తమ సినిమాలతో వచ్చేస్తున్నారు. చిన్న చిన్న సినిమాలు కూడా ఇప్పుడే రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ క్రిస్మస్ కి వారం ముందు నుంచే స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో ఇప్పుడే చిన్న సినిమాలు అన్ని విడుదల అవుతున్నాయి.

SaiPallavi : సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి సోదరి.. డిసెంబర్ 3న ఫస్ట్ సినిమా రిలీజ్

థియేటర్స్ లో :

ఈ వారం రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘అనుభవించు రాజా’ నవంబర్ 26న రిలీజ్ అవుతుంది. ఇక సంపూర్ణేష్ బాబు నటించిన ‘క్యాలీఫ్లవర్’ నవంబర్ 25న రానుంది. తమిళ్ హీరో శింబు ‘ది లూప్’ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా నవంబర్ 25న రాబోతున్నాడు. నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ మెయిన్ లీడ్స్ లో ‘1997’ నవంబర్ 26న రానుంది. కమెడియన్ షకలక శంకర్ హీరోగా ‘కార్పొరేటర్’ సినిమా నవంబర్ 26న అనౌన్స్ చేశారు కానీ దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు. మరి రిలీజ్ చేస్తారో వాయిదా పడుతుందో చూడాలి. ఇక దిశ ఎన్కౌంటర్ ని బేస్ చేసుకొని ఆర్జీవీ తీసిన ‘ఆశ ఎన్కౌంటర్’ కూడా నవంబర్ 26న విడుదల అవ్వనుంది. మరో చిన్న సినిమా ‘భగత్ సింగ్ నగర్’ కూడా నవంబర్ 26న రానుంది. బాలీవుడ్ లో జాన్‌ అబ్రహం నటించిన ‘సత్యమేవ జయతే 2’ నవంబర్ 25న, సల్మాన్ నటించిన ‘అంతిమ్’ 26న విడుదల అవుతున్నాయి.

Kartikeya : హీరో కార్తికేయ పెళ్లి వేడుకలు

ఓటిటిలో :

వెంకటేష్ హీరోగా నటించిన మలయాళం హిట్ మూవీ ‘దృశ్యం 2’ రీమేక్ ‘దృశ్యం 2’ గా నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. పూరి జగన్నాద్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా చేసిన ‘రొమాంటిక్’ సినిమా నవంబర్ 26 న ఆహాలో విడుదల అవ్వబోతుంది. సాయిధరమ్ తేజ్ నటించిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా ‘రిపబ్లిక్’ నవంబర్ 26న జీ5లో విడుదల అవ్వనుంది.

వీటితో పాటు అమెజాన్‌ ప్రైమ్‌ లో ‘కొట్టిగొబ్బ3’ అనే కన్నడ సినిమా నవంబరు 23న, ‘చోరీ’ బాలీవుడ్ సినిమా నవంబరు 26న రాబోతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌ లో హాలీవుడ్ సినిమాలు ట్రూ స్టోరీ, బ్రూయిజ్డ్ నవంబరు 24న, ఏ కాజిల్‌ ఫర్‌ క్రిస్మస్‌ నవంబరు 26న విడుదల అవ్వనున్నాయి.

డిస్నీ+ హాట్‌స్టార్‌ లో బాలీవుడ్ మూవీ ‘2024’ నవంబరు 23న, తెలుగు డబ్బింగ్‌ ‘హాక్ ఐ’ నవంబరు 24న, ‘దిల్‌ బెకరార్‌’ హిందీ వెబ్‌ సిరీస్‌ నవంబరు 26న విడుదల అవ్వనున్నాయి.

సోనీ లివ్‌ లో ‘శివరంజనీయుమ్‌ ఇన్నుం శిల పెంగాళుమ్‌’ తమిళం మూవీ నవంబరు 26న విడుదల కాబోతుంది.