SaiPallavi : సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి సోదరి.. డిసెంబర్ 3న ఫస్ట్ సినిమా రిలీజ్

తాజాగా సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ కూడా సినీ పరిశ్రమలోకి రాబోతుంది. సాయి పల్లవి, పూజా కన్నన్ ఇద్దరూ కూడా చూసేందుకు ఒకేలా కనిపిస్తారు. గతంలోనే పూజా కన్నన్...

SaiPallavi : సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి సోదరి.. డిసెంబర్ 3న ఫస్ట్ సినిమా రిలీజ్

Sai Pallavi

SaiPallavi :  తెలుగు, తమిళ్, మలయాళంలో సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తో బాగా డిమాండ్ కూడా ఏర్పడింది. హీరోయిన్స్ లో సాయి పల్లవి వేరయా అంటూ తాను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. సాయి పల్లవి ఓకే చేసే కథలు కూడా చాలా బాగుంటాయి. తనకి విజయాల శాతమే ఎక్కువ. ఇక తన డ్యాన్స్ తో ఎంతో మందిని అభిమానులుగా మార్చుకుంది. తనకి కథ నచ్చకపోతే చిరంజీవి సినిమానే వద్దని చెప్పింది. ఇక సాయిపల్లవి మేకప్ వేసుకోదు, యాడ్స్ చేయదు, ఎక్స్పోజింగ్ చేయదు, బోల్డ్ సీన్స్ చేయదు. ఇన్ని హద్దులు ఉన్నా కూడా సాయిపల్లవికి డిమాండ్ ఉంది అంటే తన నటన, డ్యాన్స్, క్రేజ్ లే కారణం.

Kartikeya : హీరో కార్తికేయ పెళ్లి వేడుకలు

తాజాగా సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ కూడా సినీ పరిశ్రమలోకి రాబోతుంది. సాయి పల్లవి, పూజా కన్నన్ ఇద్దరూ కూడా చూసేందుకు ఒకేలా కనిపిస్తారు. గతంలోనే పూజా కన్నన్ సినీ ఎంట్రీ గురించి వార్తలు వచ్చాయి. తాజాగా అధికారిక ప్రకటన రావడంతో ఇది కన్ఫర్మ్ అయింది. తమిళంలో పూజా కన్నన్ ఎంట్రీ ఉండబోతుంది.

Bigg Boss 5 : నన్ను రెచ్చగొట్టకు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి డైలాగులు అంకితం

తెలుగు, తమిళ్ సినిమాల్లో పేరు సంపాదించిన ఫైట్ మాస్టర్ స్టంట్ సిల్వ దర్శకుడిగా మారి తన మొదటి సినిమాని తీశారు. ‘చిత్తారాయి సెవ్వనం’ ఈ సినిమా టైటిల్. దీంట్లో సముద్రఖని, పూజా కన్నన్ మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. వీరిద్దరూ తండ్రి కూతుళ్లుగా నటించబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా సముద్రఖని, పూజా కన్నన్ లతో కూడిన సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దాంతో పాటు ఈ చిత్రం రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 3న ‘చిత్తారాయి సెవ్వనం’ సినిమా డైరెక్ట్ గా జీ5 ఓటిటిలో విడుదల అవ్వబోతుంది.

Bigg Boss Priya : ప్రియా కూతురి పెళ్ళిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి

మరి పూజా కూడా తన అక్కలాగా మెప్పించి వరుస సినిమా ఆఫర్స్ పట్టేస్తుందేమో చూడాలి. ఈ పోస్టర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో ఉండే సినిమాలా అనిపిస్తుంది. పూజా డీ గ్లామర్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని తమిళ్ స్టార్ హీరో ధనుష్ రిలీజ్ చేశారు.