Canada Immigration Rules : విదేశీ విద్యార్థులకు కెనడా కొత్త రూల్స్.. ఇక ఎంట్రీ అంత ఈజీ కాదు.. ఏటా 1.5 లక్షల మందికే ఛాన్స్!
Canada New Immigration Rules : కెనడా విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై కొత్త పరిమితులు విధించింది. 2027 నుంచి 2029 వరకు ఏటా 1.5 లక్షల మంది విద్యార్థులకే అవకాశం. భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుందో ఇప్పుడు చూద్దాం..
Canada Immigration Rules
- కెనడా వెళ్లాలనుకునే స్టూడెంట్స్కు షాక్..
- కెనడా వీసాలపై భారీ ఆంక్షలు..
- భారతీయ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం?
Canada New Immigration Rules : కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న విదేశీ విద్యార్థులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే వీసా నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు తాజాగా కెనడా తీసుకున్న నిర్ణయం మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇకపై విదేశీ విద్యార్థుల రాకను మరింత కట్టడి చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కెనడాకు వెళ్లి చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు కూడా కొత్త నిబంధనలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది..
ఏటా 1.5 లక్షల మంది విదేశీ విద్యార్థులు :
తాజా నిర్ణయం ప్రకారం.. 2027 నుంచి 2029 వరకు కెనడా ఏటా 1.5 లక్షల మంది విదేశీ విద్యార్థులను మాత్రమే అనుమతించనుంది. అంటే.. గతంతో పోలిస్తే విద్యార్థుల ప్రవేశాలపై మరింత నియంత్రణ ఉండనుంది. కేవలం స్టూడెంట్ వీసాలే కాదు.. తాత్కాలిక ఉద్యోగ వీసాలపైనా పరిమితులు విధించింది..
ప్రతి ఏడాది 3.7 లక్షల మందికే అవకాశం :
మొత్తంగా ఏటా 3.7 లక్షల మంది తాత్కాలిక వలసదారులకు మాత్రమే అవకాశం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 1.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు కాగా.. మరో 2.2 లక్షల మంది తాత్కాలిక విదేశీ ఉద్యోగులు ఉంటారు. మరోవైపు 2026లో విదేశీ విద్యార్థులకు 1.55 లక్షల ప్రవేశాల లక్ష్యాన్ని కెనడా నిర్ణయించింది..
Read Also : Rahul Gandhi : రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదు.. మోదీ, అదానీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
వలసల సంఖ్య నియంత్రణకు :
అసలు కెనడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? అనే ప్రశ్నకు అక్కడి పరిస్థితులే సమాధానం చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో విదేశీ విద్యార్థులు, తాత్కాలిక వలసదారుల సంఖ్య పెరగడంతో ఇళ్ల కొరత, అద్దెల భారం, ఆరోగ్య సేవలు, ఇతర ప్రజా సదుపాయాలపై ఒత్తిడి పెరిగింది. దీంతో స్థానికుల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా వలసల సంఖ్యను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది..
అయితే, ఈ రూల్స్ ప్రధానంగా కొత్తగా కెనడాకు రావాలనుకునే వారిపైనే ప్రభావం ఎక్కువ చూపనుంది. ఇప్పటికే అక్కడ చదువుతున్నవారు, ఉంటున్నవారికి ఇదే విధంగా వర్తిస్తుందని భావించకూడదు. మొత్తానికి కెనడాలో చదువుకోవాలనుకునే వారు ఇకపై అడ్మిషన్, వీసా ప్లానింగ్ మరింత జాగ్రత్తగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది.
