BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జి.. బీఎం సందీప్‌కు కీలక బాధ్యతలు!
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్ఛార్జిగా బీఎం సందీప్ నియమితులయ్యారు. మీనాక్షి నటరాజన్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న ఆయనకు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలివే..
BM Sandeep
- కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం..
- తెలంగాణ ఇన్ఛార్జిగా బీఎం సందీప్
- మీనాక్షి నటరాజన్ స్థానంలో బీఎం సందీప్..
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను ఇకపై ఎవరు నడిపిస్తారనే చర్చకు కాంగ్రెస్ అధిష్ఠానం తెరదించింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా బీఎం సందీప్‌ను నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ నియామకం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మల్లికార్జున ఖర్గే ఆమోదం :
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో బీఎం సందీప్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Read Also : Rahul Gandhi : రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదు.. మోదీ, అదానీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
విదేశాలకు మీనాక్షి నటరాజన్ :
ఉన్నత చదువుల కోసం మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఆమె అందించిన సేవలను అధిష్ఠానం ప్రత్యేకంగా గుర్తుచేసుకుంది..
బీఎం సందీప్ వైపే మొగ్గు :
వాస్తవానికి, తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి ఎంపికపై కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే దానిపై పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మాణిక్‌రావు థాక్రే పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. అయితే, చివరకు అధిష్ఠానం బీఎం సందీప్ వైపే మొగ్గు చూపింది..
ఇక కొత్త ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టనున్న బీఎం సందీప్ ముందు పలు కీలక అంశాలు ఉండనున్నాయి. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, నాయకుల మధ్య సమన్వయం పెంచడం, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను ఉత్సాహపరచడం వంటి అంశాలు ఆయనకు సవాళ్లుగా మారనున్నాయి..
