Dhoni – Vijay : ధోని పీఎం.. విజయ్ సీఎం.. వైరల్ అవుతున్న ఫ్యాన్స్ ఫ్లెక్సీలు..

ధోని.. దళపతి.. ఒకరు క్రికెట్ లెజెండ్.. మరొకరు సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్.. వీళ్లిద్దరూ కలిసి కనిపిస్తే అభిమానుల ఆనందం ఏ రేంజ్‌లో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు..

Dhoni – Vijay : ధోని పీఎం.. విజయ్ సీఎం.. వైరల్ అవుతున్న ఫ్యాన్స్ ఫ్లెక్సీలు..

Dhoni Vijay

Dhoni – Vijay: అభిమానం అనేది హద్దుల్లో ఉన్నంత వరకు ముద్దుగానే ఉంటుంది కానీ లిమిట్స్ దాటితే ఇబ్బందులు తప్పవు. తెలుగుతో కంపేర్ చేస్తే తమిళనాట హీరోల ఫ్యాన్స్ మరీ ఊరనాటుగా ఉంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కత్తులు దూసుకున్న సంఘటనలు కూడా చూశాం.

Dhoni - Vijay

ఇప్పుడు అభిమానుల వెర్రితనం వల్ల ఇద్దరు లెజెండ్స్ ఇబ్బందుల్లో పడ్డారు. వివరాళ్లోకి వెళ్తే.. ధోని.. దళపతి.. ఒకరు క్రికెట్ లెజెండ్.. మరొకరు సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్.. వీళ్లిద్దరూ కలిసి కనిపిస్తే అభిమానుల ఆనందం ఏ రేంజ్‌లో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇటీవల యాడ్ షూటింగ్ కోసం ధోని, సినిమా షూటింగ్ కోసం విజయ్ అనుకోకుండా చెన్నైలోని గోకులం స్టూడియోలో ఎదురు పడ్డారు. ఇద్దరు కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని పిక్స్ తీసుకున్నారు కూడా.

Dhoni – Vijay : ధోనితో దళపతి.. పిక్స్ వైరల్..

ఆ ఫొటోలు నెట్టింట మామూలుగా హల్ చల్ చెయ్యలేదు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. కొందరు ఫ్యాన్స్ ధోనీ భారతదేశానికి కాబోయే పీఎం, విజయ్ తమిళనాడుకి కాబోయే సీఎం అంటూ మధురైలో ఫ్లెక్సీలు కట్టడం వివాదంగా మారింది. భవిష్యత్తులో ఈ ఇద్దరు లెజెండ్స్‌ను రాజకీయ నాయకులుగా చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ కట్టిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో ‘బీస్ట్’ సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

Vijay – Beast First Look : దళపతి కొత్త సినిమా ‘బీస్ట్’.. ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్..