Dhoni – Vijay : ధోనితో దళపతి.. పిక్స్ వైరల్..
ధోని.. దళపతి.. ఒకరు క్రికెట్ లెజెండ్.. మరొకరు సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్..

Dhoni Vijay
Dhoni – Vijay: ధోని.. దళపతి.. ఒకరు క్రికెట్ లెజెండ్.. మరొకరు సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడడం స్టార్ట్ చేసినప్పటినుండే తమిళ తంబీలు ధోనిని క్రికెట్ ‘తల’ గా ఆరాధించడం మొదలుపెట్టారు. ఇక ఇళయ దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేములో కనిపిస్తే.. క్రికెట్ అండ్ మూవీ లవర్స్‌కి మామూలు హ్యాపీగా ఉండదు మరి. అలాంటి మిరాకిల్ చెన్నైలో జరిగింది. యాడ్ షూటింగ్ కోసం ధోని, సినిమా షూటింగ్ కోసం విజయ్ అనుకోకుండా ఒకే స్టూడియోలో ఎదురు పడ్డారు. ఇద్దరు కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని పిక్స్ తీసుకున్నారు కూడా.

చెన్నైలోని గోకులం స్టూడియోస్‌లో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘బీస్ట్’ షూట్ జరుగుతోంది. పక్క ఫ్లోర్‌లో ధోని నటిస్తున్న పాపులర్ బ్రాండ్ యాడ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ధోని, విజయ్ కలిసి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరు కలిసి తీసుకున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
